RRR OTT Release Date: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీ రాక కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను జీ5 వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ రిటీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించింది జీ 5 సంస్థ. అధికారిక పోస్టర్ ను విడుదల చేస్తూ.. మే 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతుందని క్లారిటీ ఇచ్చింది.
RRR
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనే ఓటీటీలో రిలీజ్ అవుతుంది. హిందీలో రిలీజ్ కావడం లేదు. ఇక జీ 5లో ఈ చిత్రాన్ని వీక్షించాలంటే.. పే ఫర్ వ్యూ లెక్కలో డబ్బులు చెల్లించాలని ఆ మధ్య బాగా వార్తలు వినిపించాయి. కానీ, జీ 5 సంస్థ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఈ పే ఫర్ వ్యూ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.
Also Read: Mahesh Babu: 20 ఏళ్లుగా మహేష్ తో సినిమా కోసం స్టార్ డైరెక్టర్ వెయిటింగ్?
అంటే ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జీ 5లో ఫ్రీగా చూడొచ్చు. ఇది ప్రేక్షకులకు శుభవార్తనే. ఆర్ఆర్ఆర్ సినిమా డిజిటల్ రైట్స్ ను జీ5 వారు భారీ ధరకు కొన్నారు. ఏది ఏమైనా నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ భారీ విజయాన్ని అందుకుంది.
RRR
‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్స్ చూసి సినిమా విశ్లేషకులు సైతం షాక్ అయ్యారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా 10 రోజుల్లోనే టోటల్ వరల్డ్ వైడ్ గా 501.74 కోట్లు కలెక్ట్ చేసింది.
అంటే.. పదో రోజు నుంచి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాలు కింద లెక్కే. ఒక తెలుగు సినిమా ఫస్ట్ టెన్ డేస్ కలెక్షన్స్ లో ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. అసలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. ప్రపంచ సినీ లోకమంతా షాక్ అయిపోయింది.
Also Read:Acharya: 12 డేస్ కలెక్షన్స్.. మెగాస్టార్ కి ఎన్ని కోట్లు నష్టం అంటే ?
Recommended Videos