Top Director : సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ఒక సినిమా తీశాడు అంటే దానికి సంబంధించిన లెక్కలు అనేవి కీలకపాత్ర వహిస్తూ ఉంటాయి. అది ఒక స్టార్ హీరో తో సినిమా చేసినప్పుడు ఆ సినిమా సూపర్ సక్సెస్ అయితే వాళ్ల ప్రతిభా చాలా వరకు ఎలివేట్ అవుతుంది. అలాగే తనకి స్టార్ డైరెక్టర్ అనే ముద్ర కూడా పడుతుంది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ నుంచి ముగ్గురు దర్శకులు టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందుతున్నారు. అయితే అందులో ఎవరు టాప్ డైరెక్టర్ అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
తెలుగు నుంచి సందీప్ రెడ్డి వంగా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ లను కొడుతూ తనకంటూ మంచి గుర్తింపును అయితే సంపాదించుకుంటున్నాడు. ఇక తమిళ్ నుంచి లోకేష్ కనకరాజు ఈ లిస్ట్ లో ఉన్నాడు. ఇప్పటివరకు తను చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ సక్సెస్ లు అవడంతో ఆయన కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపబడుతున్నాడు. ఇక కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ తన సినిమాలతో ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. ఈయన తీసిన ప్రతి సినిమా కూడా ఇప్పుడు సూపర్ సక్సెస్ లు గా నిలుస్తున్నాయి. రీసెంట్ గా తీసిన సలార్ సినిమాతో భారీ ఇమేజ్ ని అయితే క్రియేట్ చేసుకున్నాడు…
ఇక సందీప్ రెడ్డి వంగ ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. దానివల్ల ఆయన స్టార్ డైరెక్టర్ గా ముందు వరుసలో కొనసాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన చేసిన యానిమల్ సినిమాతో ఏకంగా 900 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ 2 సినిమాతో 1200 కోట్ల వరకు కలెక్షన్ల ను రాబట్టాడు. ఇక సలార్ సినిమాతో 800 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టాడు. దీంతో పాటు లోకేష్ కనక రాజ్ కూడా విక్రమ్ సినిమాతో తన స్టామినా ఏంటో చూపించాడు. దాదాపు 600 కోట్ల వరకు కలెక్షన్స్ ని కొల్లగొట్టి తన మార్క్ స్టామినాని అయితే ఇండియా రేంజ్ లో చూపించాడు…
ఇక ఇప్పటివరకు కలెక్షన్స్ పరంగా చూసుకున్నటైతే ప్రశాంత్ నీల్ టాప్ రేస్ ఉన్నాడు. ఒకవేళ కంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగా డిఫరెంట్ అటెంప్ట్ లతో ప్రేక్షకులందరిని అలరిస్తున్నాడు. కాబట్టి ఈయన టాప్ రేస్ లో ఉన్నాడు. ఇక వీళ్ళ ముగ్గురిలో ఎవరు బెస్ట్ అనేది పర్టిక్యూలర్ గా చెప్పాలి. ఇక వీళ్ళ తర్వాత సినిమాలు రిలీజ్ అయితే గాని ఒక క్లారిటీ అయితే రాదు…