Gold Price Today: బంగారం, వెండి ధరలు కాస్త ఊరటనిచ్చాయి. సోమవారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నొ ఒక్కరోజే భారీ స్థాయిలో పెరిగిన వెండి ఈరోజు స్వల్పంగా తగ్గింది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే20న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,390గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.74,610 గా ఉంది. మే 19న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..68,400తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి ఆదివారంతో పోలిస్తే సోమవారం రూ.10 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,540 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.74,760గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.68,390 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.74,610 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.68,490 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,720తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.68,390 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,610తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,390తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,610తో విక్రయిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు తగ్గాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.92,900గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం రూ.100 తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.92,900గా ఉంది. ముంబైలో రూ.92,900, చెన్నైలో రూ.96,400, బెంగుళూరులో 92,600, హైదరాబాద్ లో రూ.96,400తో విక్రయిస్తున్నారు.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More