Salaar Review
Salaar Review: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సీజ్ ఫైర్ సినిమా భారీ అంచనాల మధ్య ఈరోజు రిలీజ్ అయింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడం తో ఈ సినిమా పైన ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రభాస్ కి హిట్ తీసుకొచ్చిందా ? లేదా ? ప్రశాంత్ నీల్ మేకింగ్ తో మరొకసారి మ్యాజిక్ చేశాడా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఇక ముందుగా సినిమా కథలోకి వెళ్తే ఖాన్సర్ అనే ఒక సామ్రాజ్యానికి రాజా మన్నర్ (జగపతి బాబు) దొరగా ఉంటాడు.ఈయన లాగే కొన్ని ప్రాంతాలకు కొందరు దొర లు ఉంటారు. అయితే వాళ్లని కాదు అని రాజా మన్నర్ తను బతికి వుండగానే తన కొడుకు అయిన వరద రాజా మన్నర్ ని దొర గా చూడాలి అనుకుంటాడు. అయితే కొన్ని ఏళ్ళ పాటు వరద రాజ మన్నర్ కొన్ని ప్రాంతాలు తిరిగి వచ్చే లోపే ఇక్కడ పరిస్థితులు అన్ని మారిపోతాయి. కుర్చీ కోసం కొట్లాట మొదలవుతుంది.దాంట్లో మిగిలిన దొరలందరు కలిసి వరద రాజ మన్నర్ ని చంపేయాలని ప్లాన్ చేస్తారు. దాంతో వాళ్లంతా వరద రాజ మన్నర్ మీద కి వాళ్ల సైన్యం తో వస్తారు అప్పుడు వరదరాజ మన్నర్ తన ఫ్రెండ్ అయిన దేవా(ప్రభాస్) ని తన సైన్యం గా తెచ్చుకుంటాడు దేవా వరద రాజ్ కోసం ఒక్కడే ఎలా పోరాడాడు అసలు ఆయన ఇన్ని రోజులు వరద రాజ్ కి దూరం ఉండటానికి కారణం ఏంటి..?వరద అనుకున్నట్టు గానే తనకి రాజ్యం దక్కిందా లేదా.? అసలు దేవా లైఫ్ లోకి అధ్య (శ్రుతి హాసన్) ఎలా వచ్చింది అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
Also Read: సలార్ ట్విట్టర్ రివ్యూ: ప్రభాస్ సినిమాకు ఊహించని టాక్, హైలెట్స్ ఇవే!
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఖాన్సర్ అనే వరల్డ్ ని చూపించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ చూపించిన ఎలివేషన్ సీన్స్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ గాని చాలా బాగా చూపించాడు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు గా ఎలివేషన్ ఇస్తు సినిమా గ్రాఫ్ ని అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వచ్చాడు.అలాగే ప్రభాస్ ని భారీ రేంజ్ లో వాడుకుంటూ తన మార్క్ ఆఫ్ ఎలివేషన్స్ పీక్స్ లెవల్లో చూపించాడు. ప్రభాస్ ని ఈ మధ్యకాలంలో ఏ డైరెక్టర్లు వాడుకోని రేంజ్ లో ప్రశాంత్ నీల్ వాడుకున్నాడు…ఇక కొన్ని ఫైట్ సీక్వెన్స్ లో అయితే ప్రేక్షకులకి విపరీతమైన ఆనందాన్ని కలిగించడమే కాకుండా కొన్ని పర్టికులర్ సీన్స్ ని హైలెట్ గా తీర్చి దిద్దాడు…ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ముఖ్యంగా సీన్లు ఎలివేట్ అవ్వడానికి మాత్రం అతను చాలా బాగా హెల్ప్ చేశాడనే చెప్పాలి… ఫస్ట్ ఆఫ్ వరకు సినిమా ఓకే గా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఖాన్సార్ వరల్డ్ ని బిల్డ్ చేసే ప్రయత్నంలో స్టోరీ అనేది సాగుతూ ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడికి సినిమా కొద్దిపాటి బోర్ ని అయితే కొట్టిస్తుంది. అయితే ఈ సెటప్ అంతా ఎందుకు వాడుకున్నాడు అంటే సలార్ సెకండ్ పార్ట్ కోసం ఇక్కడినుంచి బీజం వేస్తూ తీసుకెళ్లాడు. దానివల్ల ఇదంతా సగటు ప్రేక్షకుడికి కొంచెం బోరింగ్ గానే అనిపిస్తుంది. కానీ వరల్డ్ బిల్డింగ్ మాత్రం ఇక్కడే చేయాలి కాబట్టి చేసుకుంటూ వచ్చాడు.ఇక ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ ఏ పాయింట్ అఫ్ వ్యూలో ప్రభాస్ తో ఈ సినిమా తీయాలి అనుకున్నాడో తెలియదు గానీ అతను తీసిన మొదటి సినిమా అయిన ఉగ్రం సినిమా కథనే తీసుకొచ్చి దానికి కొన్ని మసాలాలు యాడ్ చేసి సలార్ అని పేరు పెట్టి పెద్ద హీరో తో పాన్ ఇండియా సినిమాగా తీశాడు. ఒక స్టార్ హీరోతో సినిమా చేసేటప్పుడు ఒక మంచి కథతో రావాలి గాని ఆల్రెడీ తీసిన కథని రీమేక్ చేస్తూ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు…దీనికి బదులు ఒక ఫ్రెష్ కథ తో ఒకే పార్ట్ ఉండే విధంగా స్టోరీ రాసుకొని ప్రభాస్ తో చేసిన బాగుండేది. ఎందుకంటే ఆల్రెడీ చూసిన ఉగ్రం సినిమాని మళ్లీ చూడండి రా అని ప్రేక్షకుల మీదకి తోసినట్టు గా ఉంది. ఇక ప్రభాస్ పొటెన్షియాలిటీ తెలిసి కూడా ఇలాంటి నాసిరకం కథతో సినిమా ఎందుకు చేశాడో ప్రశాంత్ నీల్ కే తెలియాలి….
సినిమా అంటే అన్ని క్రాఫ్ట్ లలో సత్తా చాటేలా ఉండాలి కథ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉండాలి. అంతే తప్ప ఒక ఫ్రెండ్ షిప్, తల్లి అనే ఎమోషన్స్ ని ఆడ్ చేసుకుని కంప్లీట్ సినిమా ని తీర్చిదిద్దాలనుకోవడం ప్రశాంత్ నీల్ చేస్తున్న తప్పు అనే చెప్పాలి.ఇంతకు ముందు కేజీఎఫ్ లో ఆల్రెడీ మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అదే సెంటిమెంట్ అన్ని వేళలా వర్కౌట్ అవ్వదు కాబట్టి ఈ సినిమాలో తల్లి సెంటిమెంట్ ఉన్నా పర్లేదు కానీ కథ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉంటే బాగుండేది…ఇక సెకండ్ ఆఫ్ మొత్తం గురించి ఖానార్ గురించే సెటప్ చేసుకున్నాడు ఇక్కడే సగం సినిమా చూడాలని ఇంట్రెస్ట్ పోయింది.మొదటి పార్ట్ సలార్ సీజ్ ఫైర్ గా తీసుకుంటే సెకండ్ పార్ట్ కి మరొక పేరు పెట్టారు దీనివల్ల ఇపుడు తీస్తున్న మొదటి పార్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది మన అందరూ డైరెక్టర్లు చేస్తున్న మిస్టేక్ ఇదే రెండో పార్ట్ మీద ఫోకస్ చేసి ఇప్పుడు చెప్పే కథ ని క్లారిటీ గా చెప్పడం లేదు దాని వల్లనే సినిమా మీద ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ పోతుంది దీనివల్ల చెప్పేది ఏంటంటే తీసేది ఒక పార్ట్ సినిమా అయిన కూడా క్లారిటీ గా తీయండి రెండు పార్టులు పెట్టీ ఎందుకు జనాన్ని హింసిస్తారు…ఇక ఇది ఇలా ఉంటే చివరిలో ప్రభాస్, పృధ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే ఫైట్ కూడా వాళ్ళిద్దరూ కొట్టుకోవాలనే ఎమోషన్ అయితే మనకు ఎక్కడ రాదు ఏదో కొట్టుకుంటున్నారు మనం చూడాలి అన్నట్టు ఉంటుంది.కానీ రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కొట్టుకుంటున్నప్పుడు మాత్రం ఆ ఫీల్ గాని, ఆ ఎమోషన్ గాని ఈ సినిమాలో అసలు ఎక్కడ రాకపోవడం విశేషం…
ప్రశాంత్ నీల్ ఇప్పటికైనా తన స్ట్రాటజీ మార్చుకొని డెప్త్ ఉన్న కథలతో సినిమాలు చేస్తే బాగుంటుంది, పార్ట్ వన్, పార్ట్ టూ అనే దానిమీద ఫోకస్ చేసి కథ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా పోతున్నాడు ప్రభాస్ లాంటి ఒక కత్తిలాంటి హీరో దొరికినప్పుడు చేయాల్సిన కథ మాత్రం ఇది అయితే కాదు. ఒక కొరటాల శివ ప్రభాస్ తో మిర్చి సినిమా ఎలా చేశాడో,రాజమౌళి ఛత్రపతి, బాహుబలి లాంటి సినిమాలు అయితే ఎలా తీశాడో అంత డెప్త్ తో కనక ప్రభాస్ ను సినిమాలో చూపిస్తే ఆ సినిమాని వరల్డ్ లోనే నెంబర్ వన్ హిట్ గా నిలపగలిగే కెపాసిటీ ఉన్న స్టార్ హీరో ప్రభాస్…అలాంటి హీరోతో ఒక నాసిరకం స్క్రిప్ట్ తీసుకొచ్చి అసలు క్యారెక్టర్జేషన్స్ ని కూడా సరిగ్గా డిజైన్ చేసుకోకుండా ఓన్లీ ఫైట్స్ ని బేస్ చేసుకుని చిన్నపాటి ఎమోషన్ ని చూపిస్తూ చేస్తే సినిమా సక్సెస్ అవుతుందనుకోవడం ప్రశాంత్ నీల్ మూర్ఖత్వం… ఎమోషనల్ సీన్స్ ఉండాలి అంటే ఫస్ట్ ఆ సీన్ల ని బిల్డ్ చూసుకునే స్టోరీ పర్ఫెక్ట్ గా ఉండాలి. అది లేకపోతే ఎన్ని ఏడ్పులు ఏడ్చిన అలాగే ఎన్ని ఫైటింగ్ సీన్స్ చేసిన అది ఆడియెన్ రిసీవ్ చేసుకోలేడు…
ఇక ఆర్టిస్తు ల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ప్రభాస్ ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. కొన్ని సీన్లలో అయితే ప్రభాస్ ఇంతకుముందు ఏ సినిమాలో చూపించని విధంగా తన హావ భావాలని చాలా చూపించాడు…పృథ్వి రాజ్ సుకుమారన్ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా నటించాడు. కొన్ని సీన్లలో అయితే తన క్రూయల్టీ ని అద్భుతంగా చూపించడమే కాకుండా ఆ సీన్ తాలూకు జస్టిఫికేషన్ కూడా పర్ఫెక్ట్ గా తన నటన తో పొట్రే చేశాడు. ఇక శృతిహాసన్ క్యారెక్టర్ కూడా చాలా చిన్నది కావడంతో తను కూడా ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది అంతే తప్ప.తన పాత్ర కి ఇంపార్టెన్స్ అయితే పెద్దగా ఏమీ లేదు అలాగే జగపతి బాబు క్యారెక్టర్ కూడా కొంతవరకు పర్లేదు. ఇక మిగతా అన్ని క్యారెక్టర్లు కూడా ఓకే అనిపించాయి…
ఇక ఈ సినిమాలో టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ పరంగా ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన రవి బసురార్ ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అలాగే సినిమాటోగ్రాఫర్ అయిన భువన్ గౌడ్ చూపించిన విజువల్స్ కూడా బాగున్నాయి. కొన్ని విజువల్స్ అయితే టాప్ ఆఫ్ ది నాచ్ లా ఉన్నాయి. ఇక ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి ప్రశాంత్ నీల్ తీసిన అనవసరపు సీన్స్ ని చాలా వరకు కట్ చేశాడు. లెంత్ అనేది ఫస్ట్ ఆఫ్ లో చాలా నీట్ గా ఉంటుంది. కానీ సెకండాఫ్ లో మాత్రం ఉజ్వల్ ఎడిటింగ్ పనితీరు కనిపించింది కానీ సీన్లలో ఉన్న ఆ మ్యాటర్ పోట్రే చేయడంలో డైరెక్టర్ కొంతవరకు తడబడ్డట్టు కనిపించడంతో సెకండ్ హాఫ్ మనకు కొంచెం లాగ్ అయినట్టుగా అనిపిస్తుంది…అది కంప్లీట్ డైరెక్టర్ మిస్టేక్… ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఈ సినిమా కోసం వాడిన సెట్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి…
ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే…
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్
కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్…
ఇక ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే…
కథ
డైరెక్షన్ (అక్కడక్కడ)
కొన్ని సీన్లలో సెంటిమెంట్ అనేది పెద్దగా వర్కౌట్ కాలేదు…
చివరి లైన్ : సలార్ సీజు ఫైర్ గా వచ్చిన ఈ సినిమా పెద్దగా ఫైర్ అయితే చూపించలేకపోయింది…
ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.75/5