‘రాధే’లో అదరగొట్టిన ప్రభాస్!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తాజాగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈమూవీలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ యూరప్‌లో జరుగుతుంది. దీనిలో భాగంగా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ప్రభాస్ ఓ ఛేజింగ్ సీన్ చేసినట్లు సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశంలో ప్రభాస్ నటన అద్భుతంగా ఉండబోతుందని సమాచారం. ఈ మూవీకి ‘రాధే’ అని టైటిల్ పరిశీలనలో ఉంది. కరోనా వైరస్ కారణంగా […]

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తాజాగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈమూవీలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ యూరప్‌లో జరుగుతుంది. దీనిలో భాగంగా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ప్రభాస్ ఓ ఛేజింగ్ సీన్ చేసినట్లు సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశంలో ప్రభాస్ నటన అద్భుతంగా ఉండబోతుందని సమాచారం. ఈ మూవీకి ‘రాధే’ అని టైటిల్ పరిశీలనలో ఉంది.
కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో సినిమాల్లో షూటింగ్ లు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ప్రభాస్ చిత్రం త్వరోలనే యూరప్‌లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేసింది. త్వరలో చిత్రబృందం యూరోప్ వెళ్లనుందని చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ పేర్కొంది. గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 2020 దసరా సెలవుల్లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.
ఈ మూవీ పూర్తికాగానే ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రకటనను దర్శకుడు అనౌన్స్ చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ మూవీని భారీ బడ్జెట్లో తెరకెక్కించనున్నారు. సైంటిఫిక్ కథాంశంతో ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్నాడు. ప్రభాస్ ఇందులో సూపర్ హీరో తరహా క్యారెక్టర్లో నటిస్తాడని ప్రచారం జరుగుతుంది.