Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Prabhas: కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్? ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్!

Prabhas: కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్? ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్!

Prabhas: హీరో ప్రభాస్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చర్చకు దారి తీసింది. లైఫ్ లోకి డార్లింగ్ వస్తుందని ఆయన కామెంట్ చేశాడు. ప్రభాస్ పెళ్లి పై హింట్ ఇచ్చేశాడంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ వివాహం ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. 40 ప్లస్ లో ఉన్న ప్రభాస్ కి ఇప్పటికే పెళ్ళై పిల్లలు ఉండాల్సింది. ప్రభాస్ తోటి హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ పెళ్లి చేసుకుని వారసులను కూడా ఇచ్చారు. ప్రభాస్ మాత్రం ఒంటరిగా ఉండిపోయారు. ప్రభాస్ కి పెళ్లి చేయాలని పెదనాన్న కృష్ణంరాజు చాలా ప్రయత్నం చేశారనే టాక్ ఉంది.

ప్రభాస్ మాత్రం పెళ్లి విషయం దాటేసుకుంటూ వచ్చాడు. అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ కి బాలయ్య నుండి ఈ ప్రశ్న ఎదురైంది. ప్రభాస్ సిల్లీ ఆన్సర్స్ చెప్పి తప్పుకున్నాడు. సల్మాన్ పెళ్లి చేసుకుంటే నేను కూడా చేసుకుంటాను అన్నాడు. ప్రభాస్ కామెంట్స్ ఫ్యాన్స్ లో పెళ్లి ఆశలు చంపేశాయి. ప్రభాస్ లైఫ్ లో పెళ్లి చేసుకోకపోవచ్చని ఫిక్స్ అయ్యారు. అయితే ప్రభాస్ తాజా పోస్ట్ వాళ్లలో ఆశలు చిగురించేలా చేసింది.

Prabhas
Prabhas

సోషల్ మీడియాలో అరుదుగా కనిపించే ప్రభాస్… ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఒక కామెంట్ పోస్ట్ చేశాడు. ‘డార్లింగ్స్… ఎట్టకేలకు మన జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి వస్తుంది. వచ్చి చూడండి’ అని కామెంట్ చేశాడు. ప్రభాస్ ఈ కామెంట్ తన పెళ్లిని ఉద్దేశించి చేశాడు. కాబోయే భార్యను పరిచయం చేయబోతున్నాడని ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రభాస్ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

అయితే ప్రభాస్ చేసిన ఈ కామెంట్ పెళ్లి గురించి కాదని టాలీవుడ్ వర్గాల వాదన. కల్కి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ ఈ పోస్ట్ పెట్టాడని అంటున్నారు. కల్కి చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహిస్తున్నారట. దానికి సంబంధించిందే ఈ పోస్ట్ అంటున్నారు. అలాగే పాయల్ రాజ్ పుత్ కల్కి లో ఓ పాత్ర చేసిందట. ఆమెను ఉద్దేశించి ప్రభాస్ ఈ పోస్ట్ పెట్టాడని అంటున్నారు. అసలు నిజం ఏమిటో తెలియాలంటే వెయిట్ చేయాలి..

RELATED ARTICLES

Most Popular