Prabhas: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు ప్రభాస్…ప్రస్తుతం పాన్ ఇండియాలో సినిమాలు చేస్తూ విజయాలను సాధిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడానికి జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తో ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు సినిమా చేయాలని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ ప్రొడక్షన్ హౌస్ ఏది, ఆ ప్రొడ్యూసర్ ఎవరు అంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి అల్లు అరవింద్ చాలా రోజుల నుంచి సన్నాహాలైతే చేస్తున్నాడు. అయినప్పటికీ ప్రభాస్ మాత్రం వాళ్లకి డేట్స్ అయితే ఇవ్వడం లేదు.
ఎందుకంటే మిగతా ప్రొడ్యూసర్లకి కమిట్ అయినా కమిట్మెంట్లు ఉండటం వల్ల తను ఆ ప్రొడ్యూసర్ కి డేట్లు ఇవ్వడం లేదంటూ అల్లు అరవింద్ గారితో ఆయన ఒకసారి మాట్లాడి చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఒప్పుకున్నా కమిట్మెంట్లు అన్ని పూర్తి అయిన తర్వాత అల్లు అరవింద్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే ప్రభాస్ ఒక సినిమాని గీతా ఆర్ట్స్ లో చేస్తానని ఇంతకుముందే ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ గారితో చెప్పారట.
అయితే వీళ్ళ బ్యానర్ లో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ ప్రాజెక్టు ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం క్లారిటీగా తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం అల్లు అరవింద్ బోయపాటి శ్రీను తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు…