Kalki 2898 AD
Kalki 2898 AD : ఇక రీసెంట్ గా ప్రభాస్ ఇన్ స్టా లో పెట్టిన ఒక స్టోరీ కి సంబంధించిన చాలా కథనాలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ప్రభాస్ ‘నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది’ అని పెట్టిన స్టోరీ కి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఏదో ఒక కథనాన్ని అయితే వాళ్ల కామెంట్ల రూపం లో తెలియజేశారు.ఇంక అందులో చాలా మంది ప్రభాస్ పెళ్లికి సంబంధించిన మ్యాటర్ చెప్పబోతున్నాడు అని ఒక న్యూస్ ను స్ప్రెడ్ చేశారు.
ఇక మొత్తానికైతే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన మ్యాటర్ కాకుండా కల్కి మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ ని తెలియజేయడానికి సినిమా యూనిట్ ఒక స్పెషల్ స్ట్రాటజీని వాడినట్టుగా తెలుస్తుంది. కల్కి సినిమాలో ప్రభాస్ వాహనం పేరు బుజ్జి.. ఇక ప్రభాస్ పెట్టిన స్టోరీ ఆ వైహికిల్ కి సంబంధించిన అప్డేట్ అని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే బుజ్జి వాహనానికి సంబంధించిన ఫ్రీ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఇక అందులో బుజ్జి కి బ్రెయిన్ మాత్రమే ఉంటుంది. కానీ బాడీ అయితే ఉండదు. ఇక బుజ్జి నాకు బ్రెయిన్ ఉంది బాడీ లేదు అని బాధపడుతుంటే బుజ్జి కి బాడీ ని తయారు చేయడానికి అందరూ టెక్నీషియన్స్ పడే కష్టాన్ని చూపిస్తూ ఫన్నీగా ఒక వీడియోను అయితే డిజైన్ చేశారు.
ఇక దానికి అనుకూలంగానే ఆ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో ఎక్కువ వియర్ షిప్ ను సంపాదించుకోవడమే కాకుండా వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చివర్లో బుజ్జి నాకు బ్రెయిన్ ఉంది కానీ బాడీ లేదు అని బాధ పడుతున్న సమయంలో భైరవ (ప్రభాస్) వచ్చి ‘నీ టైం స్టార్ట్ అయింది బుజ్జి పద’ అని చెప్పడంతో బుజ్జి భైరవ ఇద్దరు కలిసి బుజ్జి బాడీ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ వాహనం మీదున్న క్లాత్ ను భైరవ తీసివేస్తాడు.
దాంతో బుజ్జి కి సంబంధించిన ఫుల్ వీడియోని ఈనెల 22వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో బుజ్జి, భైరవ కలిసి ఒక పెద్ద ప్రళయాన్ని ఆపబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే కల్కి సినిమాకి సంబంధించిన ప్రమోషన్ చాలా గట్టిగానే చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ ప్రమోషనల్ వీడియోతో సినిమా మీద భారీగా అంచనాలైతే పెరిగే అవకాశాలు ఉన్నాయి…