Kalki Movie: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పొలిటికల్ ఫీవర్ అనేది ఎక్కువగా నడుస్తుంది. ఇక తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రాలో మాత్రం పొలిటికల్ హీట్ అనేది మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి. కేవలం పార్లమెంటుకు జరిగే ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంత పెద్ద పోటీ వాతావరణం అయితే ఏమి కనిపించడం లేదు. కానీ ఆంధ్రాలో అసెంబ్లీ, పార్లమెంట్ రెండు ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతుండటం వల్ల అక్కడ విపరీతమైన పోటీ అయితే నెలకొంది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఎవరికి వారు ప్రచారంలో బిజీగా కొనసాగుతున్నప్పటికీ ఏ పార్టీని ఇష్టపడే సినీ సెలబ్రిటీలు ఆ పార్టీ తరపున మద్దతుగా నిలబడుతున్నారు. ఇక ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు ఇస్తూ వస్తున్న సినిమా ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ మరొకసారి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.. చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన ‘మరోసారి చంద్రబాబు గారే రావాలి’ అన్నట్టుగా ట్వీట్ చేశాడు. ఇక దీనివల్ల టిడిపి శ్రేణుల్లో కొంతవరకు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనగా, వైసిపి లో మాత్రం ఆయన మీద నెగిటివ్ అభిప్రాయమైతే ఏర్పడుతుంది.
మరి ఇలాంటి క్రమంలో మరోసారి వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే జూన్ 27వ తేదీన రిలీజ్ కాబోతున్న కల్కి సినిమా మీద వైసిపి ప్రభుత్వం భారీ దెబ్బకొట్టే ప్రమాదం ఏమైనా ఉందా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారే కాబట్టి ఏ రకంగానైనా ఈ సినిమాకి హాని కలిగించే ప్రయత్నం చేయొచ్చు అంటూ ప్రభాస్ అభిమానులు అశ్విని దత్ పట్ల కొంత ఫైర్ అవుతున్నారు…
ఇక ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మన అందరం చూశాం..కాబట్టి ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా అని ప్రభాస్ అభిమానులైతే భయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…