Celebrity Weddings 2021: ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టిన సినీ ప్రముఖులు వీళ్లే..

Celebrity Weddings 2021: సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ విషయం అభిమానులకు పెద్దదే. ఇక వారి జీవితంలో మ్యారేజ్ అయితే తమకు చెందిన విషయంగానే అభిమానులు భావిస్తుంటారు. సెలబ్రిటీలకు ఉన్న స్టార్ స్టేటస్ వల్ల అటువంటి పరిస్థితులు ఏర్పడుతాయి. కరోనా మహమ్మారి వల్ల సెలబ్రిటీలు కొంత కాలం పాటు సినిమా షూటింగ్స్ వదిలేసి హ్యాపీగా వాళ్ల ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారు. తమ ఇంట్రెస్ట్‌ను కనుగొన్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు తమ మ్యారేజ్ గురించి ఆలోచన చేశారు. […]

  • Written By: Neelambaram
  • Published On:
Celebrity Weddings 2021: ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టిన సినీ ప్రముఖులు వీళ్లే..

Celebrity Weddings 2021: సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ విషయం అభిమానులకు పెద్దదే. ఇక వారి జీవితంలో మ్యారేజ్ అయితే తమకు చెందిన విషయంగానే అభిమానులు భావిస్తుంటారు. సెలబ్రిటీలకు ఉన్న స్టార్ స్టేటస్ వల్ల అటువంటి పరిస్థితులు ఏర్పడుతాయి. కరోనా మహమ్మారి వల్ల సెలబ్రిటీలు కొంత కాలం పాటు సినిమా షూటింగ్స్ వదిలేసి హ్యాపీగా వాళ్ల ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారు. తమ ఇంట్రెస్ట్‌ను కనుగొన్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు తమ మ్యారేజ్ గురించి ఆలోచన చేశారు. పెళ్లి చేసేందుకు సిద్ధమైపోయారు. కాగా ఈ ఏడాది కూడా కొవిడ్ పరిస్థితులున్నప్పటికీ పలువురు సినిమా తారలు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వారు ఎవరంటే..

Celebrity Weddings 2021

Singer Sunitha with her Husband

సింగర్ సునీత ఈ ఏడాది ఫేమస్ బిజినెస్ మ్యాన్, మ్యాంగ్ మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని మ్యారేజ్ చేసుకుంది. హీరోలు వరుణ్ ధావన్, విష్ణు విశాల్, విక్కీ కౌశల్, కార్తీకేయ., హీరోయిన్స్ ప్రణీత, దియా మీర్జా, శ్రద్ధా ఆర్య, కత్రినా కైఫ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివరాల్లోకెళితే.. టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ తన స్నేహితురాలు లోహితరెడ్డిని మ్యారేజ్ చేసుకున్నాడు. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగగా, టాలీవుడ్ సినీ ప్రముఖులు వీరి పెళ్లి వేడుకలకు హాజరయ్యారు.

Celebrity Weddings 2021

Hero Kartikeya with his wife Lohitha Reddy

‘గొడవ’ ఫేమ్ శ్రద్ధా ఆర్య ఢిల్లీకి చెందిన నేవీ ఆఫీసర్ రాహుల్ శర్మను మ్యారేజ్ చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ యామీ గౌతమ్ కూడా పెళ్లి చేసుకుంది. ‘యూరీ’ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య ధర్‌‌ను మనువాడింది. యాక్టర్ ఆశీష్ గాంధీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నికితను మ్యారేజ్ చేసుకున్నాడు. బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రణీత సుభాష్ కూడా పెళ్లి పీటలెక్కింది. బిజినెస్ మ్యాన్ నితిన్ రాజ్‌ను ఈ భామ సింపుల్‌గా మ్యారేజ్ చేసుకుంది. వీరి పెళ్లి అతి తక్కువ మంది అతిథుల మధ్య జరిగింది. హీరో విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాను మ్యారేజ్ చేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దియా మీర్జా, వైభవ్ రేఖిని పెళ్లి చేసుకుంది.

Also Read: సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అయిన నటి జెనీలియా…

Celebrity Weddings 2021

Vicky Kaushal and Katrina Kaif Wedding

బీ టౌన్ హీరో వరుణ్ ధావన్, నటాషా దలాల్‌ను మ్యారేజ్ చేసుకున్నాడు. బీ టౌన్ బ్యూటిఫుల్ భామ కత్రినా కైఫ్ యంగ్ హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకుంది. విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ కంటే ఏజ్ లో చిన్నవాడని బీ టౌన్‌లో వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది సినీ ప్రముఖులు చేసుకున్న పెళ్లిళ్లన్నీ కూడా దాదాపుగా కొవిడ్ నిబంధనల మధ్య అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో జరిగాయి.

Also Read: హెల్ప్ చేద్దామనుకున్నా.. కానీ నేనే బయటకు వచ్చేసా..షణ్ముక్‌పై రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Tags

    follow us