Women: నాజుకు నడుము, చూడగానే ఆకర్షించే అందం, ఫిట్ నెస్ తో ఉంటారు కొందరు అమ్మాయిలు. కానీ పెళ్లి తర్వాత ఇలా మెయింటెన్ చేయడం చాలా మందికి కష్టమే. అయినా అమ్మాయిలు ఆంటీలా మారిపోవడానికి పెళ్లి ఒకటే కారణం అంటారా? బాడీ సైజ్ అంటారా? అయినా మెయింటెన్ చేయాలి గురు.. అప్పుడే కదా అందంగా కనిపించేది అనుకుంటున్నారా? ఒకసారి పెళ్లి తర్వాత ఎందుకు లావు అవుతారో చూసేయండి.
పెళ్లి తర్వాత సన్నగా ఉన్న వారు కూడా బొద్దుగా, బందరు లడ్డూలా తయారు అవుతారు. చాలా మందిలో ఇదే జరుగుతుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే పెళ్లికి ముందు చదువు, ఉద్యోగం, అంటూ టెన్సన్ష్ తో ఉంటారు. దీని వల్ల పెద్ద తిండిపై కూడా శ్రద్ద వహించరు. దీని వల్ల అధిక బరువు పెరగకుండా సన్నగా ఉంటారు. కానీ పెళ్లి తర్వాత కష్టపడి పనిచేసిన వారికి కూడా గ్యాప్ వస్తుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. పెళ్లి తర్వాత చాలా మహిళల్లో బద్దకం పెరుగుతుంది అంటారు.
ఉద్యోగం చేసే మహిళల్లో ఈ సమస్య తక్కువగా ఉన్నా.. ఇంట్లో ఉండే మహిళల్లో మాత్రం ఈ సమస్య ఎక్కువ ఉంటుంది అంటున్నారు నిపుణులు. కొన్ని సార్లు ఇంట్లోనే కదా ఉండేది అని మెల్లగా పనులు చేస్తుంటారు. కొన్నిసార్లు పనిచేయడానికి కూడా బద్దకిస్తారు. లేదంటే పనిమనుషులను పెట్టుకుంటారు ఈ కారణాల వల్ల మరింత బరువు పెరుగుతారట. అంతేకాదు ఏదైనా ఆహారం మిగిలిపోతే.. హృదా చేయడం ఎందుకు అని తినేస్తుంటారు. అంతేకాదు పని ఉంటే కాస్త ఆదరబాదరగా తినే వారు సమయం ఉన్నప్పుడు నిదానంగా తింటారు.
ఇది కూడా బరువు పెరగడానికి ఒక కారణమే అంటున్నారు నిపుణులు. పెళ్లికి ముందు వ్యాయామం, జిమ్ కి వెళ్లడం చేస్తుంటారు. కానీ పెళ్లి తర్వాత వ్యాయామం, జిమ్ కి వెళ్లడం వంటి వాటికి బ్రేక్ వస్తుంది. అందుకే మరింత బరువు పెరుగుతారు. సో మీరు కూడా ఇలాగే చేస్తే.. ఇప్పుడైన మార్చుకోండి.