Homeఎంటర్టైన్మెంట్Pallavi Prashanth: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వైరల్...

Pallavi Prashanth: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వైరల్ అవుతున్న వీడియో!

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ అవతరించిన సంగతి తెలిసిందే. ఒక సామాన్యుడు టైటిల్ కొట్టడం ఊహించని పరిణామం. గతంలో కూడా సామాన్యులు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ వారెవరు టైటిల్ విన్నర్స్ కాలేకపోయారు. బిగ్ బాస్ హౌస్ కి వచ్చే వరకు పల్లవి ప్రశాంత్ కొద్ది మందికి మాత్రమే తెలిసిన సోషల్ మీడియా స్టార్. ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టి విన్నర్ అయ్యాడు. శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అంబటి అర్జున్ వంటి టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి టైటిల్ అందుకున్నాడు.

ఫినాలే అనంతరం జరిగిన పరిణామాలు పల్లవి ప్రశాంత్ ని జైలుపాలు చేశాయి. అభిమానుల అత్యుత్సాహం వలన అల్లర్లు చోటు చేసుకున్నాయి. పోలీసుల సూచనలు పల్లవి ప్రశాంత్ పాటించలేదు. దాంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రెండు రోజుల అనంతరం బెయిల్ పై పల్లవి ప్రశాంత్ విడుదల అయ్యాడు.

హౌస్ నుండి బయటకు వచ్చాక పల్లవి ప్రశాంత్ తన మిత్రులతో సందడి చేశాడు. బుల్లితెర ఈవెంట్స్ లో సైతం పాల్గొన్నాడు. హౌస్లో తనకు మద్దతుగా ఉన్న శివాజీని పల్లవి ప్రశాంత్ తరచుగా కలుస్తున్నాడు. కొన్నాళ్లుగా పల్లవి ప్రశాంత్ సైలెంట్ అయిన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ ఏం చేస్తున్నాడని గమనిస్తే… అతడు పొలం పనుల్లో బిజీ అయ్యాడు. ఈ మేరకు పల్లవి ప్రశాంత్ షేర్ చేసి వీడియో వైరల్ అవుతుంది.

పల్లవి ప్రశాంత్ తన తండ్రితో కలిసి పొలం లో బోరు వేయిస్తున్నాడు. స్వయంగా ఆ పనులు చేస్తున్నాడు. నేను మరలా పనిలో నిమగ్నమయ్యాను అని పల్లవి ప్రశాంత్ ఆ వీడియోకి కామెంట్ పెట్టాడు. పల్లవి ప్రశాంత్ రైతుగా పొలం పనులు చేసుకుంటున్నాడు. ఇక ఆయన ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ పేద రైతులకు బిగ్ బాస్ ప్రైజ్ మనీ సహాయం చేస్తానని చెప్పాడు. కానీ పూర్తి స్థాయిలో ఆ పని నెరవేర్చలేదు.

 

View this post on Instagram

 

A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)

RELATED ARTICLES

Most Popular