Trinayani serial actor Chandu Challa suicide
Chandu-Pavithra: సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం ఇక్కడ ఎవరికివారు స్టార్ డమ్ ను సంపాదించుకొని స్టార్లుగా వెలుగొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కానీ చాలామంది ఇక్కడ ఇబ్బందులను ఎదుర్కొంటూ అవకాశాలను దక్కించుకోలేక చాలావరకు బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మరి కొంతమంది మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీకి రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వెనకడుగు వేస్తుంటారు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉండే విపత్కర పరిస్థితులే దానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు… ముఖ్యంగా అమ్మాయిలైతే ఇండస్ట్రీకి రావడానికి చాలావరకు ఇబ్బంది పడుతుంటారు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం టెలివిజన్ నటుడు అయినా చల్లా చంద్ అలియాస్ చంద్రకాంత్ నిన్న సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది టెలివిజన్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరిని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి… ఆయన ఇప్పుడు ‘త్రినయని ‘ సీరియల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాడు. ఇక ఆయనకు ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్న క్రమంలో ఇలాంటి ఒక తొందరపాటు నిర్ణయం వల్ల తన లైఫ్ ను తను కోల్పోవడమే కాకుండా తనని నమ్ముకున్న వారిని సైతం అనాథలను చేసి వెళ్లిపోవడం అనేది నిజంగా బాధకరమైన విషయం అనే చెప్పాలి. అయితే చంద్రకాంత్ మరణం వెనక కారణం ఏంటంటే.. గత నాలుగు రోజుల క్రితమే త్రినయని సీరియల్ నటి అయిన ‘పవిత్ర జయరాం’ మహబూబ్ నగర్ దగ్గర జరిగిన ఒక యాక్సిడెంట్ లో మరణించింది.పవిత్ర జయరాం చంద్రకాంత్ ఇద్దరూ కూడా త్రినయని సీరియల్లో నటిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది అంటూ కొద్దిరోజుల క్రితం నుంచి చాలా వార్తలైతే బయటకు వస్తున్నాయి.
నిజానికి నాలుగు రోజుల కిందట ఆమె మరణించినప్పుడు చంద్రకాంత్ చేసిన పోస్ట్ లు చాలా వైరల్ గా మారాయి. ఆయన చాలా ఎమోషనల్ గా నువ్వు లేకుండా నేను బతకలేను, నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు అంటూ ఆయన పెట్టిన పోస్ట్ లు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇక ఆయన కంటే వయసులో చాలా పెద్దదైన పవిత్ర జయరాం కి చంద్రకాంత్ కి మధ్య ఎలా పరిచయం ఏర్పడింది. వాళ్ళు ఎందుకు అంతలా క్లోజ్ అయ్యారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం..
త్రినయని సీరియల్ లో పవిత్ర జయరాం లేడి విలన్ క్యారెక్టర్ ని పోషిస్తుంది. ఈ సీరియల్ లో చంద్రకాంత్ పవిత్ర జయరాం తమ్ముడిగా నటిస్తున్నాడు. ఇక వీళ్లిద్దరి మధ్య ఆ సీరియల్ సమయంలోనే మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. అలాగే పవిత్ర జయరాం తన ఫ్యామిలీ కి దూరంగా ఉంటుంది కాబట్టి చంద్రకాంత్ చూపించే ప్రేమకి ఆమె దాసోహం అయింది. అది కాస్త సహజీవనానికి దారి తీసింది. ఇక దానివల్లే వీళ్ళిద్దరూ ఒకరికొకరు షూటింగ్స్ టైం లో కలుసుకొని మాట్లాడుకుంటూ ఒకరి ఫ్లాట్ కి ఒకరు వెళుతూ ఉండేవాళ్ళు. ఇక చంద్రకాంత్ కి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పవిత్ర కి కూడా పెళ్లైంది. అయితే పవిత్ర జయరాం ప్రాపర్ కర్ణాటక రాష్ట్రం లోని ఒక చిన్న పల్లెటూరు అయినప్పటికీ తను సీరియల్స్ లో బిజీ అవడం వల్ల హైదరాబాద్ లో సెటిల్ అయింది. ఇక తను మే 13వ తేదీన తన సొంత ఊరు కి వెళ్లి వస్తుండగానే యాక్సిడెంట్ లో మరణించింది.
ఇక ఆమె లేని బాధ ను తట్టుకోలేకే చంద్రకాంత్ సూసైడ్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇంతకు ముందు కూడా వీళ్లిద్దరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఒకరికొకరు ప్రేమ పక్షుల్లా తిరుగుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేసేవారు. ఇక కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా పవిత్ర జయరాం ఆక్సిడెంట్ లో మరణించిన తర్వాత ఈయన కూడా ఆ బాధని భరించలేక సూసైడ్ చేసుకున్నాడు అనే విషయం చాలా క్లియర్ గా తెలిసి పోతుంది. ఇక రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ పరిధిలోగల అల్కాపూర్ కాలనీ లో నివాసం ఉంటున్న చంద్రకాంత్ తన ఇంట్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయాడని ప్రాథమిక విచారణలో తేలింది. ఇక ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన కారణాలు ఏంటి అనేది అందరిని విచారించిన తర్వాత మీడియా ముందుకు తీసుకొస్తామంటూ పోలీసులు చెబుతున్నారు…
ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని రోజుల నుంచి ఇల్లీగల్ ఎఫైర్స్ ఎక్కువవుతున్నాయి. దాని వల్లే చాలామంది విడాకులు తీసుకొని విడిపోతున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కొందరు అవకాశాల కోసం కొందరికి దగ్గరవుతుంటే, మరికొందరు వాళ్లకి ఉన్న రాయల్ లైఫ్ ని వాడుకుంటూ ఇలాంటి ఎఫైర్స్ ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇలాంటి ధోరణి నుంచి సినిమా ఇండస్ట్రీలోని నటీనటులు మారితే తప్ప ఇలాంటి సంఘటనలు జరగకుండా అపలేము అనేది మాత్రం వాస్తవం… ఇక చంద్రకాంత్ తన భార్య పిల్లలను అనాధలను చేసి అనంతలోకాలకు వెళ్లిపోవడం అనేది సరైన విషయం కాదనే చెప్పాలి…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Reason behind trinayani serial actor chandu challa suicide
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com