Horoscope Today: 2024 మే 19 ఆదివారం రోజున ద్వాదశ రాశులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కన్యరాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో సింహరాశి వారు కోర్టు సమస్య నుంచి బయటపడుతారు. మరో రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
వివాహ ప్రయత్నాలు ఎక్కువవుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు ఇష్టపడి చదువుతారు. విహార యాత్రలకుప్లాన్ చేస్తారు.
వృషభ రాశి:
ఈ రాశి వారు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. వ్యాపారులు కొత్త అవకాశాలను పొందుతారు. ఆర్థికపరంగా మెరుగ్గా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
మిథున రాశి:
కలలను నెరవేర్చుకోవడానికి కొంచెం కష్టపడుతారు. వ్యాపారంలో ఆదాయ వస్తుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
కర్కాటక రాశి:
ఇంట్లో శుభకార్యాలు ఉండే అవకాశం. కొన్ని పరిశోధనలు ఫలిస్తాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
సింహారాశి:
ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. కోర్టు కేసులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతుంది.
కన్య రాశి:
కొన్ని ప్రణాళికల ద్వారా ముందుకు వెల్తారు. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఉంటాయి. కొన్ని సవాళ్లనుస్వీకరించాల్సి వస్తుంది.
తుల రాశి:
ఈ రాశివారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు పొందుతారు.
వృశ్చిక రాశి:
బావోద్వేగాలకు గురి కాకూడదు. ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో ఎక్కువగా వాదనలు చేయొద్దు. ఆర్థిక విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి.
ధనస్సు రాశి:
మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి మంచి లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో డిన్నర్ లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు.
మకర రాశి:
కొన్ని పనులకు అడ్డంకులు ఏర్పడుతాయి. ఆహారపు అలవాట్లపై నియంత్రణ ఉండాలి. ఉద్యోగులు కొన్ని పనుల్ల బిజీగా ఉంటారు. ఆదాయం పెరిగినా.. ఖర్చులు ఉంటాయి.
కుంభరాశి:
ప్రత్యేక వ్యక్తుల నుంచి బహుమతి పొందుతారు. ఓ పని చేసినందుకు ప్రశంసలు దక్కుతాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
మీనరాశి:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు తోటివారితో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం. ఆదాయం పెరుగుతుంది.