Sumanth: అక్కినేని నాగేశ్వరరావు ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు. ఇక క్రమ క్రమం గా తన స్టార్ డమ్ ను ఇండస్ట్రీలో విస్తరించుకుంటూ వచ్చాడు. ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ల ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున కూడా కొంచెం తడబడ్డాడు. అయినప్పటికీ ఆ తర్వాత శివ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అప్పటినుంచి వెనుతిరిగి చూడకుండా సక్సెస్ లను కొడుతూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు.
ఇక నాగార్జున తర్వాత సుమంత్ ప్రేమ కథ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకి సంచలన దర్శకుడుగా పేరుపొందిన రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా వ్యవహరించడం విశేషం. సుమంత్ చేసిన మొదటి సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాల వల్ల ఆయనకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.
ఇక అప్పుడే సుమంత్ దగ్గరికి నువ్వే కావాలి, ఇడియట్ లాంటి స్టోరీలు వచ్చాయి. అయినప్పటికి ఆయన వాటిని సెలెక్ట్ చేసుకోలేదు దానికి కారణం డైరెక్టర్ల మీద నమ్మకం లేకపోవడమని తెలుస్తుంది. అయితే ఆయన ఆ సినిమాలను కనక చేసినట్లయితే ఆయన కెరీయర్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. నాగార్జున ఎలాంటి కథలు చేయాలని ఒక్కసారి కూడా సుమంత్ కి సలహాలు ఇవ్వలేదని తెలుస్తుంది. నాగేశ్వరరావు గానీ, నాగార్జున గానీ కొంచెం ముందుకు వచ్చి ఆయన చేసే సినిమాలను వింటు తనకి ఎలాంటి సినిమాలో చేయాలో చెబితే బాగుంటుంది. సరైన గైడెన్స్ లేకపోవడం తోనే ప్రస్తుతం సుమంత్ ఇలా ఉన్నాడు లేకపోతే ఇప్పటికే స్టార్ హీరోల రేంజ్ లో కొనసాగుతూ ఉండేవాడు.
అందుకే సుమంత్ కెరియర్ లో నాగార్జున పాత్ర కూడా చాలానే ఉంది అని చెప్పాలి. వాళ్ల ఫ్యామిలీ నుంచి ఎవరో ఒక్కరు సుమంత్ బాధ్యతలను తీసుకొని ఎలాంటి సినిమాలు చేయాలో ఫస్ట్ లో కొంచెం గైడెన్స్ ఇస్తే బాగుండేది. అలా చేస్తే సుమంత్ కి రెండు మూడు సక్సెస్ లు అయిన వచ్చిండేవి దానిద్వారా ఆయన మార్కెట్ ఇంకా భారీగా విస్తరించుకునేది…