Bicycle Price : ఒకప్పుడు వస్తు మార్పిడి విధానం ఉండేది. కానీ ఆ విధానం గురించి ఈ జనరేషన్ ఎక్కువగా తెలియదు. పైసామే పరమాత్మ అంటున్నారు కొందరు. కానీ గతంలో డబ్బుకు పెద్దగా వాల్యూ లేదనేది కాదనలేని వాస్తవం. అంత తొందరగా కాలం మారుతుంది. వస్తువుల ధరలు కూడా మారాయి. మరి ఈ ధరలు మారడానికి కారణం ఏదైనా ఉంటుంది. కొన్ని సార్లు వస్తువు అరుదుగా దొరికితే దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనుషుల జీవనశైలికి తగ్గట్టు ధరలు మారిపోయాయి.
రాజుల కాలంలో రోడ్ల మీద డైమండ్స్ అమ్మేవారు అంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మాల్సిందే. కానీ ఇప్పుడు డైమాండ్స్ కొనాలి అంటే రాసి పెట్టి ఉండాలి అంటారు.. ఒకప్పుడు బంగారం కూడా చాలా తక్కువ ఖరీదు కానీ.. అప్పుడు అదే ఎక్కువ అనిపించిందట సామాన్యులకు. ఆ మధ్య బంగారం, డైమండ్స్ మాత్రమే కాదు. అప్పట్లో చాలా తక్కువ ధరకి అమ్మేవి అన్ని కూడా ఇప్పుడు వేలు, లక్షల్లో అమ్ముతున్నారు అంటే అదే నిజం. ఇక మనుషులు వాడే వాహనాలు కూడా అంతే మరి..
గతంలో వాహనాల ధరలు చాలా తక్కువగా ఉండేవి. అప్పటి ధరతో పొలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ.90 ఏళ్ల క్రితం సైకిల్ బిల్ ఇప్పుడు బయటికి వచ్చింది. ఒకప్పుడు సైకిల్ ధరలు చూస్తే ఇప్పటి ధరతో వాటిని పోలిస్తే అప్పుడు పది సైకిల్లు కొనేయవచ్చు. ఈ సైకిల్ బిల్ కలకత్తాలో ఉన్న కుముద్ సైకిల్ వర్క్స్ వారిది. ఇందులో సైకిల్ ధర 18 రూపాయలు అని ఉంది. 1934 లో ఈ సైకిల్ కొనుగోలు చేశారు. అప్పటి సైకిల్ ధరలు కేవలం రూ. 10 మాత్రమేనండోయ్.
ఇప్పుడు ఈ ధరకి సైకిల్ లో ఒక భాగం కాదు, సైకిల్ టైర్ కూడా రాదు. అసలు ఇప్పుడు ఇదే ధర కి సైకిల్ వస్తే 100 సైకిళ్ళు కొని పెట్టుకునేవారు. కానీ కాలంతో మాత్రమే కాదు ధరలు కూడా మారిపోతున్నాయి. ఆధునికత కూడా ఇందుకు ఒక కారణం. ఇక జనరేషన్ జనరేషన్ కు వాటి రంగులు, హంగులు కూడా మారిపోతున్నాయి. మొత్తం మీద ఇది భలే ఉంది కదా..