Murder In Mahim: ప్రేక్షకులకు క్రైమ్ థ్రిల్లర్స్ ఇచ్చే మజానే వేరు. ఓ నాలుగు దశాబ్దాల క్రితం వచ్చిన అన్వేషణ మూవీ తెలుగులో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఊహించని మలుపులు ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతాయి. కిల్లర్ ఎవరనే సస్పెన్సు ప్రేక్షకుడిని కుదురుగా ఉండనీయదు. హాలీవుడ్ నుండి అరువు తెచ్చుకున్న ఈ జోనర్ ఇండియాలో కూడా సక్సెస్ అయ్యింది. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ వచ్చాక క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి అన్ లిమిటెడ్ కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇండియన్, ఇంటర్నేషనల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్లు వివిధ ఫ్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి.
కాగా 2024లో ఓ సిరీస్ బెస్ట్ గా నిలిచింది. ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఉత్కంఠ పెంచుతూ సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ని ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారు. అదే మర్డర్ ఇన్ మాహిమ్. ప్రముఖ రచయిత జెర్రీ పింటో రాసిన మర్డర్ ఇన్ మాహిమ్ నవల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. రాజ్ ఆచార్య దర్శకత్వం వహించాడు. జియో సినిమాలో మర్డర్ ఇన్ మాహిమ్ స్ట్రీమ్ అవుతుంది.
విజయ్ రాజ్, అశుతోష్ రానా, శివాని రఘువంశ్ ప్రధాన పాత్రలు చేశారు. మర్డర్ ఇన్ మాహిమ్ సిరీస్ కి విశేష స్పందన లభిస్తుంది. 8 ఎపిసోడ్స్ తో మర్డర్ ఇన్ మాహిమ్ సిరీస్ రూపొందింది. ప్రతి ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ పై ఉత్కంఠ రేపేదిగా ఉంటుంది. ఐఎండిబి సంస్థ ఈ సిరీస్ 7.6 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. జియో సినిమాలో మే 10 నుండి మర్డర్ ఇన్ మాహిమ్ స్ట్రీమ్ అవుతుంది. అక్కడ ప్రేక్షకులు ఉచితంగా చూడవచ్చు.
మర్డర్ ఇన్ మాహిమ్ సిరీస్ ఓ యువకుడి మర్డర్ చుట్టూ తిరుగుతుంది. మాహిమ్ రైల్వే స్టేషన్ లో యువకుడు హత్యకు గురవుతాడు. అతన్ని హత్య చేసింది ఎవరో తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అశుతోష్ రాణా రంగంలోకి దిగుతాడు. ఈ హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న అశుతోష్ రాణా కొడుకే అనుమానితుడిగా ఉంటాడు. అసలు ఆ యువకుడు ఎవరు? అతన్ని ఎవరు హత్య చేశారు? అనే కోణంలో సిరీస్ సాగుతుంది. ఎవరూ ఊహించని క్లైమాక్స్ ఈ సిరీస్ కి ప్రధాన హైలెట్.