spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Devara: సైన్యంతో దండెత్తిన ఎన్టీఆర్... దేవర ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా?

Devara: సైన్యంతో దండెత్తిన ఎన్టీఆర్… దేవర ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా?

Devara: ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. చాలా వరకు చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది. దేవర రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ లుక్, ప్రోమోలు అంచనాలు పెంచేశాయి. దేవర చిత్రం నుండి తరచుగా అప్డేట్స్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. వారి దాహం తీరేలా అదిరిపోయే అప్డేట్ సిద్ధమైంది.

ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని దేవర నుండి ఫస్ట్ సాంగ్ విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ దీనిపై అధికారిక ప్రకటన జరిగింది. ఫియర్ సాంగ్ పేరుతో ఫస్ట్ సింగిల్ మే 19న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా నేడు ఫియర్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. దేవర యూనిట్ ఇచ్చిన ఈ సడన్ ట్రీట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ గూస్ బంప్స్ రేపింది. కేవలం శాంపిల్ ఇలా ఉంటే… పూర్తి సాంగ్ ఎలా వుంటుందో అనే ఆత్రుత పెంచేసింది.

ఇక ఎన్టీఆర్ లుక్ అనేది మరో హైలెట్. తన సైన్యంతో పడవల్లో యుద్దానికి దండెత్తుతున్నాడు. ఎన్టీఆర్ టైగర్ వలె ఫెరోషియస్ గా ఉన్నాడు. నేడు ప్రోమో చూశాక సాంగ్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య రెట్టింపు అవుతుంది అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న క్రమంలో ఓ పాత్ర నైజం తెలియజేసేలా ఫియర్ సాంగ్ డిజైన్ చేశారని సమాచారం.

దేవర మూవీలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమెకు ఇది ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. శ్రీదేవి వారసురాలైన జాన్వీ కపూర్… ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టడం మరొక వ్ విశేషం. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఈ చిత్ర నిర్మాతగా ఉన్నాడు. అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో దేవర విడుదల కానుంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కాగా… ఆయన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లారు.

 

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper