Nagarjuna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఇద్దరిని రెండు కండ్లుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ అప్పట్లో తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో చాలా వరకు కృషి చేశారనే చెప్పాలి. తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే డామినేషన్లను తట్టుకొని మరి తెలుగు సినిమా రేంజ్ ని పెంచడంలో వీళ్ళు చాలా కీలక పాత్రను పోషించారు.
ఇక అప్పట్లో వీళ్ళిద్దరూ చేయని పాత్రలు లేవు.. ఎలాంటి ఈగో లు లేకుండా వీళ్ళు చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఇక ఇదిలా ఉంటే నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదట్లో వరుస ప్లాప్ లను ఎదుర్కోన్నప్పటికీ ఆ తర్వాత ‘శివ ‘ లాంటి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే అక్కినేని నాగార్జున ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నాగేశ్వరరావు కొన్ని మాటలు చెప్పారట. అవి ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి కామన్ గా వస్తూ ఉంటాయి.
వాటిని చూసి పొంగిపోకుండా, కృంగిపోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పారట. ఇక దానికి తోడుగా ఇండస్ట్రీ లో ఎలాంటి పాత్ర చేసిన పర్లేదు. కానీ నువ్వు స్టార్ హీరో అయ్యేంత వరకు ‘గే’ పాత్రను మాత్రం చేయకు అని చెప్పారట. దానికి కారణం ఏంటంటే ఒక స్టార్ హీరో అవ్వాల్సిన వాళ్ళు అలాంటి పాత్రలు చేస్తే ఆడియన్స్ దృష్టిలో చాలా తక్కువగా కనిపిస్తారని దానివల్ల హీరోగా వాళ్ల కెరియర్ కు భారీ దెబ్బ పడుతుందని చెప్పాడట.
అందుకే నాగార్జున అలాంటి ఛాయలున్న పాత్రలను ఇప్పటి వరకు చేయలేదనే చెప్పాలి. ఇక నాగార్జున నాగేశ్వరరావు చెప్పిన బాటలోని నడుస్తూ స్టార్ హీరోగా ఎదిగి దాదాపు 35 సంవత్సరాల పాటు కింగ్ లా ఇండస్ట్రీ లో వెలుగొందుతున్నారనే చెప్పాలి…