Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్... సీజన్ 8కి...

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్… సీజన్ 8కి సర్వం సిద్ధం!

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. అనేక సంచలనాలు నమోదు అయ్యాయి. ఓ సామాన్యుడు టైటిల్ విన్నర్ కావడం ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన గేమ్ తో ప్రేక్షకుల మనసులు దోచేశాడు. ఇక హౌస్లో గొడవలు, రాజకీయాలు, గ్రూప్స్ కాకరేపాయి. ముఖ్యంగా స్పై బ్యాచ్ వర్సెస్ స్పా బ్యాచ్ గా సీజన్ 7 సాగింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ స్పై బ్యాచ్ కాగా, సీరియల్ నటులు శోభ శెట్టి, ప్రియాంక సింగ్, అమర్ దీప్ స్పా బ్యాచ్.

పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, యావర్ ఫైనల్ కి వెళ్లారు. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా, అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. మొదటి నుండి టైటిల్ ఫేవరేట్ గా ప్రచారమైన శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ త్వరలో వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం అందుతుంది.

జూన్ నుండే బిగ్ బాస్ తెలుగు 8కి ఏర్పాట్లు మొదలు కానున్నాయట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టనున్నారట. మేకర్స్ టాప్ సెలెబ్స్ ని సంప్రదిస్తున్నారట. వెండితెర, బుల్లితెర సెలెబ్స్ తో పాటు సోషల్ మీడియా స్టార్స్ సీజన్ 8 లో భాగం కానున్నారట. బాగా తెలిసిన ముఖాలను ఎంపిక చేస్తున్నారట. సీజన్ 7లో సామాన్యుడు అద్భుతం చేశాడు. సీజన్ సక్సెస్ లో భాగమయ్యాడు. కాబట్టి ఈసారి కూడా సామాన్యుడు ఒకరు ఉంటారట.

ఇక జులై నుండి సీజన్ 8 ప్రారంభం కానుందట. జూన్ చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారం లో బిగ్ బాస్ తెలుగు 8 మొదలవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇక హోస్ట్ గా నాగార్జున మరోసారి బాధ్యతలు తీసుకోనున్నారట. ప్రస్తుతానికి ఆయనే బెస్ట్ ఛాయిస్ అని మేకర్స్ భావనగా తెలుస్తుంది. స్టార్స్ ఎవరూ ఖాళీగా లేకపోవడం, ఉన్నా ఆసక్తిగా లేని తరుణంలో నాగార్జున వరుసగా ఆరు సీజన్స్ కి హోస్టింగ్ బాధ్యతలు నెరవేర్చనున్నాడట.

RELATED ARTICLES

Most Popular