Dhanush Ishwarya: భక్తి, బంధాలకు బాగా విలువనిచ్చే సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ముదిమి వయసులో మనవళ్లతో ఆడుకునే సమయం. కూతుళ్లను ఆనందంగా చూసుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ సడెన్ గా ఇప్పుడు రజినీకాంత్ కుటుంబంలో అనుకోని ఉపద్రవం. బాంధవ్యాలు, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేసే రజినీకాంత్ నిజ జీవితంలో ఇప్పుడు అవి దూరమై కలత చెందుతున్నారట..
సినీ ప్రముఖ మధ్య పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడవని ఓ బ్యాడ్ టాక్ ఉంది. 18 ఏళ్లుగా వైవాహిక బంధంలో ఉన్న రజినీకాంత్ కూతురు -అల్లుడు ఐశ్వర్య-ధనుష్ జనవరి 17న అకస్మాత్తుగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది రజినీకాంత్ ను కృంగుబాటుకు గురిచేసిందట..
ఈ వయసులో తన జీవితంలో ఇలా అవాంఛనీయమైన పరిస్థితి రావడంతో రజినీకాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారట.. ఇప్పటికే రజినీకాంత్ తనదైన చొరవతో కూతురు అల్లుడిని కలిపేందుకు ప్రయత్నిస్తున్నాడట..
విడిపోవడం తాత్కాలికమేనని.. త్వరలో మళ్లీ వీరిద్దరూ కలుస్తారని రజినీకాంత్ విశ్వాసంతో ఉన్నాడట.. ఇంతకుముందు కూడా రజినీకాంత్ తన కూతురు, అల్లుడు మధ్య చిన్న చిన్న గొడవలను పరిష్కరించేవాడట.. కానీ వారు విడాకుల గురించి ప్రకటించడం ద్వారా ఇప్పుడు ఈ విషయాన్ని బహిరంగ పరిచారు. ఇది రజినీకాంత్ ను తీవ్రంగా కలిచివేసినట్టు తెలిసింది.