Tiger Nageswara Rao
Tiger Nageswara Rao Movie : మాస్ మహారాజా సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు పండుగ చేసుకుంటారు. ఇక రీసెంట్ గా వచ్చిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ సినిమా దసరా సందర్భంగా అంటే నిన్ననే రిలీజ్ అయింది సినిమా. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ టాక్ ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినీ హిస్టరీలో దొంగగా గుర్తింపు పొందినటువంటి టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు దర్శకనిర్మాతలు.
అయితే ఈ సినిమాలో రవితేజ నటించిన విషయం తెలిసిందే. కానీ ముందుగా ఈ సినిమా కోసం రవితేజను కాకుండా ఇతర హీరోలను అనుకున్నారట. వారు రిజెక్ట్ చేయడంతో ఈ ఆఫర్ రవితేజకు సొంతమైంది అనే టాక్ ఉంది. మొదట ఈ సినిమా ఆఫర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వద్దకు వెళ్లిందట. ఏమైందో కానీ అక్కడ సెట్ అవకపోవడంతో ఈ ఆఫర్ చిరంజీవి వద్దకు వెళ్లిందట. అయితే చిరంజీవి కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. దీంతో రవితేజను వరించింది టైగర్ నాగేశ్వర రావు సినిమా ఆఫర్.
మాస్ మహారాజా టాలీవుడ్ లో మాత్రమే నటించారు. కానీ ఈయన సినిమాలు హిందీలో డబ్ అయితే వాటికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అటు హిందీలో కూడా అభిమానులు ఎక్కువగా ఉండడంతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది ఈ సినిమా. ఇందులో రవితేజతో నుపుర్ సనన్ జతకట్టింది. ఈమెతో పాటు గాయత్రి భరద్వాజ్ కూడా సందడి చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ నటించారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం మిశ్రమ స్పందన దక్కించుకుంది. అంతా బాగున్నా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.
మొత్తంగా బెల్లంకొండ, చిరంజీవిలను దాటి ఈ మూవీ రవితేజకు రావడం.. ఆయన దీన్ని టేకప్ చేయడంతో సినిమా రూపొంది ప్రస్తుతం హిట్ టాక్ తో ముందుకు సాగుతోంది.