Sara Alikhan: బాలీవుడ్ హీరోయన్ సారా అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ సినిమాల్లో నటించకపోయినా.. అతి తక్కువ కాలంలో అటు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. వరుసగా హిందీలో సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ సారా అలీఖాన్. ఆమె నటనతో పాటు, వెయిట్ లాస్, అందానికి సంబంధించిన పోస్టులతో కుర్రకారును కవ్విస్తూ.. మంచి ఫాలోవర్స్‌ను దక్కించుకుంది.
ప్రస్సుతం థనుష్, అక్షయ్ కుమార్‌లతో కలిసి ఆంత్రంగి రే సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటి. ఈ సినిమ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి మనసులో మాటను బయట పెట్టింది సారా. ఈ క్రమంలోనే తను చేసుకోబోయే వాడు ఎలా ఉండాలో వివరించింది.
Also Read: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన లోక నాయకుడు కమల్ హాసన్…
తనకు కాబోయే భర్త తనను తన తల్లి నుంచి దూరం చేయొద్దని, ఆమెతో కలిసి జీవించడానికి ఒప్పుకోవాలని కోరింది. తన తల్లిని ఒంటరిగా వదలనని క్లియర్‌గా చెప్పేసింది సారా. తల్లి, కూతురు కలిసి తరచుగా వెకేషన్ ను ఎంజాయ్ చేస్తారు.ఎప్పటికప్పుడు ఆ ఫోటోలను సారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.
కాగా, అంత్రంగి రే సినిమాకు ఆనందర్ ఎల్రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సారా బీహారీ అమ్మాయిగా నటించనుంది. ధనుష్, అక్షయ్‌కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో ఈ సినమా సాగనుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను భూషణ్ కుమార్ టి-సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
Also Read: ఈ దాడితో నైనా ‘కంగనా’లో మార్పు వస్తోందా