Sara Alikhan: పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. అర్జున్ రెడ్డితో సంచలన సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు విజయ్. ఈ క్రమంలోనే వరుసగా గీతాగోవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాలతో మంచి టాక్ తెచ్చుకుని.. ఇప్పుడు అసలు తీరిక లేకుండా బిజీ షెడ్యూల్‌తో గడుపుతున్నారు. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లైగర్ సినిమాలో నటిస్తున్నారు. విజయ్ మ్యాన్సీ లుక్కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ క్రమంలోనే విజయ్‌తో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చాలా మంది హీరోయిన్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. తాజాగా, మరో బాలీవుడ్ హీరోయిన్ విజయ్‌కో కలిసి నటించాలని ఉందని మనసులో మాట చెప్పేసింది.
బాలీవుడ్ నటి సారా అలీఖాన్ నటించిన అత్రంగి రే సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమలోనే ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన సారా.. టాలీవుడ్ హీరో విజయ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
దక్షిణాది స్టార్ హీరోల్లో ఎవ్వరితో స్క్రీన్ షేర్ చేసుకుంటారని అడగ్గా.. విజయ్ దేవరకొండతో కలిసి నటించేందుకు రెడీ అని తెలిపింది సారా. విజయ్ చాలా కూల్ అండ్ హాట్‌గా ఉంటాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీగా ఉన్న విజయ్.. ఈ సినిమాతో బాలీవుడ్లో అరంగేట్రం చేయనున్నారు. ఇందులో మైక్‌టైసన్ నటిస్తుండటం విశేషం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.