Nandamuri Balakrishna – Sreeleela : షూటింగ్ స్పాట్ లో శ్రీలీల చెంప పగలగొట్టిన నందమూరి బాలకృష్ణ..అందరి ముందు వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన శ్రీలీల!

బాలయ్య కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చెంప చెళ్లుమనిపించడం తో షూటింగ్ స్పాట్ మొత్తం ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయిందట.

  • Written By: NARESH ENNAM
  • Published On:
Nandamuri Balakrishna – Sreeleela : షూటింగ్ స్పాట్ లో శ్రీలీల చెంప పగలగొట్టిన నందమూరి బాలకృష్ణ..అందరి ముందు వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన శ్రీలీల!

Nandamuri Balakrishna – Sreeleela: టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్ శ్రీలీల జోరు ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కుర్ర హీరోలు మరియు స్టార్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు ప్రతీ ఒక్కరికీ ఇప్పుడు శ్రీలీలనే కావాలి. ఆ రేంజ్ లో డిమాండ్ తెచ్చుకున్న శ్రీలీల ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య బాబు కి కూతురుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే బాలయ్య బాబు తో షూటింగ్ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్యాలి, చిన్న తేడా జరిగినా చెంప పగిపోతాది. అది అభిమానుల విషయం లో అయినా సరే, తన తోటి నటీనటుల విషయం లో అయినా సరే , కరెక్ట్ గా లేకపోతే చెంప చెళ్లుమనిస్తాడు బాలయ్య, శ్రీలీల విషయం లో కూడా అదే జరిగింది.

ఎవ్వరూ చెయ్యకూడని తప్పు చేసి, అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా మాటకు ఎదురు సమాధానం చెప్పి గొడవకి దిగినందుకు బాలయ్య కొట్టే పరిస్థితి ఏర్పడింది అట. అయితే ఇదంతా నిజం అనుకునే పప్పులో కాలేసినట్టే.. ఇది ముమ్మాటికీ నిజం కాదు, కేవలం నటన మాత్రమే, కానీ చెంపదెబ్బ మాత్రం సినిమాల్లో మామూలుగా చెయ్యి చెంప వరకు క్లోజ్ గా తీసుకొచ్చి ఆపేస్తారు. కానీ ఇక్కడ శ్రీలీల మాత్రం తనకి నిజమైన ఎమోషన్ రావడం కోసం బాలయ్య ని నిజంగానే కొట్టమని రిక్వెస్ట్ చేసిందట.

బాలయ్య కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చెంప చెళ్లుమనిపించడం తో షూటింగ్ స్పాట్ మొత్తం ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయిందట. ఈ షాట్ అద్భుతంగా రావడం తో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కట్ చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోయాడట, ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Read Today's Latest Gossips News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు