Balakrishna And Kamal Haasan: నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు మంచి నటులుగా గుర్తింపు సంపాదించుకొని, తనదైన రీతిలో ఇండస్ట్రీలో మంచి స్థాయిలో కొనసాగుతున్నారు. అయితే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటివరకు చాలామంది నటులు తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఇక అందులో ముఖ్యంగా నందమూరి నటసింహ మైన బాలయ్య బాబు కూడా ఇండస్ట్రీలో తనదైన మార్క్ ను చూపిస్తూ కొన్ని వైవిధ్యమైన పాత్రలను కూడా పోషిస్తూ వచ్చాడు.
అయితే ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు కాకుండా ఆర్ట్ సినిమాలు ఏమైనా ఉంటే వాటిని చేయడానికి కమల్ హాసన్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు. ఇక అందులో భాగంగానే బాలయ్య బాబు కూడా కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడానికి ఎప్పుడూ సిద్దం గా ఉండేవాడు. అందులో భాగంగా గానే సింగింతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన’ భైరవద్వీపం’ సినిమాతో బాలయ్య బాబు మొదటిసారిగా ఒక భారీ ఎక్స్పరిమెంటైతే చేశాడు. ఇక ఈ సినిమాలో తన నటన అద్భుతంగా ఉందని చాలా మంది ప్రశంసించారు.
నిజానికి ఈ సినిమాలో బాలయ్య యాక్టింగ్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. వాటన్నింటిని సక్సెస్ ఫుల్ గా చేస్తూ సునాయాసం గా ఆ సినిమాను సక్సెస్ తీరాలకి చేర్చాడు. అయితే సినిమాల విషయంలో క్యారెక్టర్ల పరంగా బాలయ్య బాబు చాలా కేర్ ఫుల్ గా ఉంటు మంచి పాత్రలు దొరికితే నటించడానికి ఎప్పుడు సిద్దం గా ఉంటాడు. ఇక అందులో భాగంగానే భైరవ ద్వీపం సినిమాలో మాత్రం ఆయన చేసిన నటన గాను, ఎక్స్ప్రెషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనే చెప్పాలి. ఇక ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది అభిమానులు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక కమల్ హాసన్ దొరికాడు అంటూ బాలయ్య గురించి చాలా గొప్పగా చెప్పారు.
నిజంగా ఆ సినిమాలో బాలయ్య బాబు యాక్టింగ్ చూస్తే కొన్ని సీన్ల ల్లో కమల్ హాసన్ కూడా తేలిపోతాడు అనేంత లా నటించి మెప్పించాడు. దాంతో ఆయన నటన లో ఉన్న సత్తా ఏంటో అందరికీ అర్థం అయింది. ఇప్పటికైనా సరైన క్యారెక్టర్ పడితే బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడు అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…