Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన చాలా మంది దర్శకులు వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను అందుకొవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులుగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక అందులో ముఖ్యంగా దాసరి నారాయణరావు ఒకరు.
ఈయన చేసిన వరుస సినిమాలు అప్పట్లో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. ఈయన ఎక్కువగా ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలతో సూపర్ సక్సెస్ సినిమాలను తీశాడు. ఇక ఈయన 150 వ సినిమాగా బాలయ్య బాబు తో చేసిన ‘పరమ వీరచక్ర ‘ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. ఆయన కెరియర్ లో బాలయ్య తో చేసిన ఒకే ఒక సినిమా పరమ వీరచక్ర…ఇక ఆ సినిమా కూడా డిజాస్టర్ అవడంతో లెజెండరీ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దాసరి గారు బాలయ్య బాబుకు మాత్రం సక్సెస్ ఇవ్వలేకపోయాడు అంటూ చాలా మంది దాసరి నారాయణరావు పైన విమర్శలను చేశారు.
నిజానికి దాసరి నారాయణరావు అంతకుముందే బాలకృష్ణతో ఒక సినిమా చేయాల్సింది కానీ అది అనుకోని కారణాలవల్ల ఆగిపోయింది. ఇక ఆ తర్వాత ఆయన ఎప్పుడూ బాలయ్య తో సినిమా చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఇంకా చిట్ట చివరి సినిమాగా ఆయన చివరి స్టేజ్ లో బాలయ్య బాబుతో సినిమా చేసి ఆయనకు ఒక డిజాస్టర్ ఇవ్వడం అనేది బాలయ్య మార్కెట్ ని కొద్ది వరకు తగ్గించిందనే చెప్పాలి. దానికి ముందే బాలయ్య బాబు సింహా అనే సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. కాబట్టి ఈ సినిమాతో కొంతవరకు ఆయన మార్కెట్ అయితే డల్ అయింది.
దాసరి నారాయణరావు చిరంజీవితో లంకేశ్వరుడు అనే సినిమా చేశాడు. ఇక చిరంజీవికి కూడా ఆయన సక్సెస్ ని ఇవ్వలేకపోయాడు.ఆయన కేవలం సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి వారికి మాత్రమే సక్సెస్ లను అందించాడు, తప్ప బాలయ్య బాబు, చిరంజీవి లాంటి సెకండ్ జనరేషన్ హీరోలకి సక్సెస్ లను అందించలేకపోయాడు…