Balakrishna: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఏ పాత్రనైనా అలవోకగా చేసే కెపాసిటీ ఉన్న నటుడు బాలయ్య. ఆయన చేసిన వరుస సినిమాలు ఒకప్పుడు ఇండస్ట్రీని దున్నేశాయనే చెప్పాలి. చిరంజీవికి పోటీ ఇచ్చిన ఒకే ఒక్క హీరోగా కూడా బాలయ్య పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఇలాంటి క్రమంలోనే బి.గోపాల్ తో బాలయ్య చేసిన చాలా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.
ఇక అందులో భాగంగానే రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు ఇండస్ట్రీ హిట్లను సాధించాయి. అయితే వీటితో పాటుగా వీళ్ళ కాంబో లో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సింది కానీ అందులో కొన్ని అతి సీన్లు చేయడం వల్ల ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లడాలు, విలన్ చైర్ లో కూర్చుంటే చైర్ దానంతట అదే ముందుకు రావడం కొన్ని ఇలాంటి సీన్లు చేయడం వల్లే బాలయ్య బాబు ఇమేజ్ డ్యామేజ్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలు కూడా భారీ డిజాస్టర్లుగా మిగిలాయి.
అయితే ఇలాంటి సీన్లు చేసేటప్పుడు బాలయ్య కొంతవరకు అబ్జెక్షన్ చెప్పి ఉంటే బాగుండేది. సినిమాకు తగ్గట్టుగా కొన్ని సీన్లని మార్పులు చేర్పులు చేసి ఉంటే బాగుండేది అని అది చూసిన బాలయ్య అభిమానులు అప్పట్లో ఈ సినిమా మీద కామెంట్లు అయితే చేశారు.ఇక మొత్తానికైతే బాలయ్య బాబు కెరియర్ లో పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమా ఒక భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.
అలాగే ఇలాంటి సీన్లు కూడా బాలయ్య కెరియర్ లో ఒక మాయని మచ్చగా మిగిలిపోయాయనే చెప్పాలి. ఇక బాలయ్య మంచితనం వల్లే ఇలా జరిగిందని మరికొందరు అంటుంటారు. డైరెక్టర్ ఏం చెబితే అది చేస్తాడు కాబట్టి ఇలాంటి సీన్ల ను కూడా యాక్సెప్ట్ చేశాడు. దానివల్లే బాలయ్య కెరియర్ కి కొంతవరకైతే ఇబ్బంది కలిగిందనే చెప్పాలి