TDP Mahanadu 2023- Nara Lokesh: మహానాడు వేదికగా లోకేష్ కు అవమానం.. ఏం జరిగిందంటే?
రాజమండ్రిలో మహానాడు ఏర్పాటుచేశారు. ప్రాంగణాన్ని అంగరంగ వైభవంగా తీర్చదిద్దారు. మహానాడు వేదికపై 400 మంది ముఖ్యులు ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు.. ఈ నేపథ్యంలో మహానాడు నిర్వహిస్తున్న ప్రాంతానికి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి, పెద్దాయన వేదికపైకి వెళ్లారు.

TDP Mahanadu 2023- Nara Lokesh: మహానాడుతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఈ మాట చెబుతున్నదెవరో తెలుసా? ఎల్లో మీడియా. సాధారణంగా పార్టీ పండుగ కాబట్టి జోష్ నెలకొనడం సర్వ సాధరణమే. కానీ మహానాడు వేదికగా జరిగిన కొన్ని లోటుపాట్లను, మాటల తూటాలను మాత్రం ఎల్లో మీడియాకు కనిపించకపోవడం దారుణం. మహానాడు తొలిరోజే యువనేత లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ ఓ సీనియర్ నేత విరుచుకుపడినట్టు తెలుస్తోంది. అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఆగ్రహంతో ఊగిపోయిన సదరు నాయకుడు కడుపులో ఉన్నదంతా కక్కేసినట్టు తెలుస్తోంది.
రాజమండ్రిలో మహానాడు ఏర్పాటుచేశారు. ప్రాంగణాన్ని అంగరంగ వైభవంగా తీర్చదిద్దారు. మహానాడు వేదికపై 400 మంది ముఖ్యులు ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు.. ఈ నేపథ్యంలో మహానాడు నిర్వహిస్తున్న ప్రాంతానికి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి, పెద్దాయన వేదికపైకి వెళ్లారు.
వేదికపై జూనియర్లు, కింద వీఐపీ గ్యాలరీల్లో ముఖ్య నాయకులు కూర్చోవడం సీనియర్ నాయకుడి కంట పడింది. పైగా వేదికపై కూర్చున్న వారంతా లోకేష్ టీమే కావడంతో సదరు నాయకుడు శివాలెత్తినట్టు తెలుస్తోంది. అసలే లోకేశ్ అంటే ఆ సీనియర్ నాయకుడికి కోపం. చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఆ సీనియర్ నేత దివంగత ఎన్టీఆర్ వైపే ఉన్నారు. అప్పట్లో చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఘనత కూడా దక్కించుకున్నారు.
ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. పేరు చివర్లో చౌదరి ఉండడం కారణంగానే ఎన్నిఅవమానాలు ఎదురైనా తట్టుకొని ఉండగలుగుతున్నారు.టీడీపీని విడిచి పెట్టలేక, గత్యంతరం లేని పరిస్థితిలో ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు వైపు వెళ్లారు. అప్పట్లో ఆ నాయకుడు చేసిన పరుష కామెంట్స్‌ను దృష్టిలో పెట్టుకుని కనీసం సుదీర్ఘ అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే ఆనాయకుడికి లోకేష్ తీరుపై అభ్యంతరాలున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో లోకేశ్‌పై ఆ నాయకుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కనీసం ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోరని, తిరిగి సమాధానం ఇవ్వరని మండిపడ్డారు. ఆ తర్వాత బుజ్జగించడంతో టీడీపీలోనే సర్దుకుపోయారు.తాజాగా మహానాడు వేదికపై లోకేష్ టీమ్ కు పెద్దపీట వేయడంపై ఆయన ఆగ్రహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. లోకేశ్ ఓ చిల్లర నాయకుడు. అతని వల్లే పార్టీ భ్రష్టు పట్టిపోతోంది. ఇది చాలదన్నట్టు అతనికి ఇలాంటి చిల్లరోళ్లంతా తోడయ్యారు. ఇలాగైతే టీడీపీ బతికి బట్ట కట్టేదెట్టా? మహానాడు వేదికపై పెద్దలకు చోటు ఇచ్చి గౌరవించాలన్న ఇంగితం లోకేశ్‌కే లేకపోతే, ఇక ఆయన టీమ్‌కు ఏముంటుంది? అని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
