Nagarjuna vs Balakrishna : నాగార్జున ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ తన నటన తో మంచి గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఒకటి మాస్ సినిమా చేస్తే , మరొకటి లవ్ స్టోరీ కి సంబంధించిన సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.
ఇక 1996 వ సంవత్సరంలో అన్నమయ్య సినిమాతో భక్తి రస ప్రధానమైన పాత్రలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత మళ్లీ రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే శ్రీరామదాసు అనే సినిమా చేసి ఆ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు… ఇక నాగార్జునని చూసి బాలయ్య బాబు కూడా పౌరాణిక సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తూ వచ్చాడు. ఇక అందులో భాగంగానే ఆయన రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో పాండు రంగడు అనే సినిమా లో నటించాడు. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ ని సాధించలేదు.
దాంతో బాలయ్య బాబు పోషించిన పాండురంగడు సినిమా లోని క్యారెక్టర్ మీద కూడా చాలా విమర్శలు అయితే వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే బాపు డైరెక్షన్ లో నటించిన శ్రీరామరాజ్యం సినిమా కూడా మంచి గుర్తింపు పొందింది. కానీ కమర్షియల్ గా ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ అయితే సాధించలేదు. ఇక బాలయ్య భక్తిరస ప్రధానమైన చిత్రాలను చేయడంలో నాగార్జున సాధించినంత క్రేజ్ ను అయితే సాధించలేకపోయాడు. కారణం ఏంటి అంటే నాగార్జున ఎంచుకున్న క్యారెక్టర్లు అలాంటివి.
మొదట ఆయన చేసిన అన్నమయ్య సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో భక్తిరస ప్రధానమైన చిత్రాలని నాగార్జున ఈజీగా చేయగలరనే పేరు సంపాదించుకున్నాడు. ఇక దాని తర్వాత ఆయన భక్తి భావాలను ప్రధానంగా చేసుకొని తీసిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ లను సాధించాయి. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు నాగార్జున ఇద్దరు కూడా వాళ్ల నాన్న లు ఎలాగైతే సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తూ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసేవారో వీళ్ళు కూడా అలాంటి ప్రయత్నం చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు… ఇక ఇప్పుడు ఇద్దరూ వాళ్ళ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…