Balakrishna: కుప్పంలో ఈసారి చంద్రబాబుకు కష్టమా? అక్కడ వైసిపి పట్టు బిగిస్తోందా? ఏపీలో కూడా టిడిపి గెలవడం అసాధ్యమా? ఈ విషయాన్ని బాలకృష్ణ ముందే పసిగట్టారా? అందుకే జాగ్రత్త పడుతున్నారా?ఇప్పుడు వైసిపి చేస్తున్న ప్రచారం ఇదే. చంద్రబాబు పై నమ్మకం లేక బాలకృష్ణ విశాఖపట్నం దృష్టి పెట్టారని టాక్ నడుస్తోంది. ఇటీవల రుషికొండలో బాలకృష్ణ కుటుంబం 66 కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేసినట్లు సాక్షిలో పతాక శీర్షికన కథనం వచ్చింది.మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి.. రాజధానిగా విశాఖ ఉంటుంది కాబట్టి.. బాలకృష్ణ విశాఖ రుషికొండలో భూములు కొనుగోలు చేసినట్లు ఆ కథనం నడిచింది.
తెలుగుదేశం పార్టీ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో సైతం తెలుగుదేశం పార్టీ అమరావతి ఇష్యూను లేవనెత్తుతోంది. రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేస్తోందని ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో వైసీపీ సైతం స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతోంది. అమరావతిలో టిడిపి నేతలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని.. అందుకే వారు అమరావతి కోసం ఆరాటపడుతున్నారని ఆరోపణలు చేస్తోంది. అయితే ఇటువంటి తరుణంలో బాలకృష్ణ కుటుంబం రు షికొండలో విలువైన భూమిని కొనుగోలు చేయడంతో వైసిపి తన అనుకూల ప్రచారానికి వాడుకుంటుంది. చంద్రబాబు గెలుస్తారని నమ్మకం ఉంటే బాలకృష్ణ విశాఖలో ఎందుకు భూములు కొనుగోలు చేస్తారని.. ఆయనకు నమ్మకం లేకే రుషికొండను ఎంచుకున్నారని హైలెట్ చేస్తోంది.
వాస్తవానికి రుషికొండ ప్రాంతం ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్ తో పాటు పర్యాటక రంగానికి కీలకంగా మారింది. కూత వేటు దూరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం… ఈ ప్రాంతంలో భూములకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. జగన్ మరోసారి అధికారంలోకి వచ్చినా.. చంద్రబాబు వచ్చినా.. ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. బహుశా ఈ ఉద్దేశ్యంతోనే బాలకృష్ణ కుటుంబం ఇక్కడ భూములు కొనుగోలు చేసి ఉండవచ్చు. కానీసాక్షి మీడియాలో ప్రత్యేక కథనం వచ్చేసరికి.. బాలకృష్ణ తెలివైన వాడివయ్యా.. చంద్రబాబు ఓడిపోతున్నారని తెలిసే మంచి నిర్ణయం తీసుకున్నావు అంటూ వైసిపి శ్రేణులు సోషల్ మీడియాలో.. ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నాయి. అందుకు సాక్షి కథనాన్ని జతపరుస్తున్నాయి.