AP: ఆంధ్రప్రదేశ్ గడిచిన ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి సాధించలేదని, జగన్ సర్కార్ సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని, విధ్వంసానికి పాల్పడ్డారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీటినే ఎక్కువగా ప్రచారం చేశాయి. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే ఏపీ గడిచిన ఐదేళ్లలో గణనీయమైన ప్రగతి సాధించింది. తలసరి ఆదాయంలోనూ, ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో, జీఎస్టీ వసూళ్లలో అంచనాలకు ఇమించిన పురోగతి సాదించింది.
తలసరి ఆదాయం ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో 2017GST collection –18లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,680 డాలర్లు ఉండగా 2022–23లో 2,670 డాలర్లకు పెరిగింది. జాతీయ సగతు ఆదాయాన్ని మించి ఏపీ తలసరి ఆదాయం పెరిగింది. జాతీయ సగటు రూ.1,72,000 ఉండగా, రాష్ట్ర సగటు రూ.2,19,518కి పెరిగింది. జాతీయ తలసరి ఆదాయం కన్నా రూ.47,518 ఎక్కువగా నమోదైంది.
పన్నుల వసూళ్లు…
ఇక పన్నుల వసూలులోనూ ఏపీ ప్రగతి సాధించింది. 2020–21లో ఆదాయపన్ను చెల్లింపుదారులు 19.79 లక్షలు ఉండగా, 2022–23లో వారి సంఖ్య 21.65 లక్షలకు పెరిగింది. ఐటీ రిటర్న్‌లు కూడా భారీగా పెరిగాయి 2020–21లో ఆ సంఖ్య 6.72 కోట్లు ఉండగా 2022–23 నాటికి 7.40 కోట్లకు పెరిగింది.
జీఎస్టీ వసూళ్లు కూడా..
ఇక ఏపీలో జీఎస్టీ వసూళ్లు కూడా ఏటా పెరుగుతున్నాయి. 2023 ఫిబ్రవరితో పోల్చుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో 12.5 శాతం అధికంగా వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ వాటా రూ.31,785 కోట్లు. ఎస్‌జీఎస్టీ 39,615 కోట్లు ఉండగా, ఐజీఎస్టీ రూ.84,098 కోట్లుగా నమోదైంది. దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన జీఎస్టీతో రూ.41,145 కోట్ల ఆదాయం వచ్చింది.
ఎంఎస్‌ఎంఈ సెక్టార్ వృద్ధి..
గడిచిన ఐదేళ్లలో ఏపీ సర్కార్ ఇస్తున్న ప్రోత్సాహకాలతో రాష్ట్రంలో ఉపాధికల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) సెక్టార్ కూడా గణనీయమైన ప్రగతి సాధించింది. పరిశ్రమల స్థాపనకు ఏపీ సర్కార్ తీసుకున్న చర్యలతో అనేక కొత్త పరిశ్రమలు పెరిగాయి. దీంతో వేలాది మందికి ఉద్యోగాలు లభించాయి. 2021–22లో ఎంఎక్‌ఎంఈల ద్వారా 12,29,335 మందికి ఉద్యోగాలు కల్పించగా, 2022–23లో ఏకంగా 27,27,273 మందికి ఉపాది లభించింది. ఉపాధి కల్పనలో ఏపీ దేశంలో 7వ స్థానంలో నిలిచింది.
బ్లూ ఎకానమీకి పునాదులు
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనతో ఏపీలో బ్లూ ఎకానమీ(ఓషన్ ఎరానమీ)లో కూడా కొత్త చరిత్ర సృష్టించింది. కోస్తా ఆంధ్రలోని 50 కిలోమీటర్ల ఓడరేవు, ఫిష్ ల్యాండర్లు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించింది. దేశంలో రెండో అతిపెద్ద తీరం కలిగి ఉండడంతో బ్లూ ఎకానమీపై కూడా జగన్ సర్కార్ దృష్టిపెట్టింది. కొత్తగా 4 ఓడ రేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మించింది.
గ్రోత్ ఇంజన్‌గా ఆంధ్రప్రదేశ్
అన్నిరంగాల్లో అభివృద్ధితో ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా మారింది. విశాఖ రాజధానిగా ఏర్పాటు అయితే మరిన్ని పరిశ్రమలు వస్తాయని భావిస్తున్నారు. ఈమేరకు జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో కొత్తగా లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని అంచనా వేస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Gst collection in ap is also increasing every year
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com