spot_img
HomeతెలంగాణCM Revanth Reddy: తెలంగాణలో ఆ జిల్లాల పేరు మార్పు.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం!

CM Revanth Reddy: తెలంగాణలో ఆ జిల్లాల పేరు మార్పు.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం!

CM Revanth Reddy: సంచలన నిర్ణయాలు, చాలెంజ్‌లతో తనదైన మార్కు పాలన సాగిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో కీలకమైనవి ఇప్పటికే అమలు చేస్తే ప్రజల మన్ననలు పొందారు. ఇక తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సమీక్ష చేస్తామని ప్రకటించారు. కమిటీ వేసి కుదింపుపై నిర్ణయం తీసుకుంటామని సంచలనం రేపారు. ఈ క్రమంలో తాజాగా ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో రెండింటి పేర్లు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్‌ను టీఎస్‌ నుంచి టీజీగా మార్చారు. త్వరలోనే తెలంగాణ తల్లి విగ్రహం, లోగో కూడా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో రెండు జిల్లాలకు కొత్త పేర్లు కూడా పెట్టాలని నిర్ణయించారు.

10 జిల్లాల నుంచి 33 జిల్లాలుగా..
తెలంగాణ ఏర్పాటు సమయంలో రాష్ట్రంలో 10 జిల్లాలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టింది. 10 జిల్లాల తెలంగాణను కేసీఆర్‌ లక్కీ నంబర్‌ 6 వచ్చేలా 33 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాట చేసిన జిల్లాలకు ప్రముఖుల పేర్లు, చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాల పేర్లు పెట్టారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్‌కు గోండు వీరుడు కుమురంభీం పేరు, భూపాలపల్లికి తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌పేరు, కొత్తగూడెంకు భద్రాద్రి పుణ్యక్షేత్రం పేరు, గద్వాలకు శక్తిపీటం జోగులాంబ పేరు, భువనగిరికి యాదాద్రి పేరు, సిరిసిల్లకు వేములవాడ రాజన్న పేరు పెట్టారు.

ఆ రెండు జిల్లాల పేర్లు మార్పు..
ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలోని 33 జిల్లాల్లో రెండు జిల్లాల పేర్లు మార్చాలని యోచిస్తోంది. జనగామ జిల్లాకు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ పేరు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఒక జిల్లాకు మాజీ ప్రధాని, భారత రత్న పీవీ.నర్సింహారావు పేరు పెట్టాలని సూచన ప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే ఈమేరకు గెజిట్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper