spot_img
HomeతెలంగాణCM Revanth Reddy: సీఎం రేవంత్‌ హామీలు అమలు చేయగలడా? కాంగ్రెస్‌ సర్కార్‌ నెరవేర్చగలదా?

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ హామీలు అమలు చేయగలడా? కాంగ్రెస్‌ సర్కార్‌ నెరవేర్చగలదా?

CM Revanth Reddy: తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయడంతోపాటు 420 హామీలతో కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచారు. తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అమలు ప్రారంభించారు. అయితే అర్హులు చాలా మంది ఈపథకాలకు నోచుకోవడం లేదు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకురూ.2500 ఆర్థికసాయం, పింఛన్ల పెంపు, రైతు భరోసా పెంపు, ధాన్యానికి రూ.500 బోనస్, రైతుల పంట రుణాల మాఫీ, విద్యార్థులకు స్కూటీలు, స్కూడెంట్‌ రుణ కార్డులు, అర్హులకు కొత్త రేషన్‌ కార్డులు, మండలానికో మోడల్‌ పాఠశాల ఏర్పాటు ఇలా అనేక కీలక హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ సాకుతో వీటి అమలు వాయిదా వేసింది రేవంత్‌ సర్కార్‌.

ఆదిలోనే ఆర్థిక కష్టాలు..
తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌కు ఆదిలోనే ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. పౌరసరఫరాల శాఖకు రూ.52,067.03 కోట్ల అప్పులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రుణాలపై వడ్డీ కారణంగానే ప్రతీనెల రూ.3,645.25 కోట్లు నష్టపోతున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మొన్నటి వరకు లోక్‌సభ ఎన్నికల బిజీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు పాలనపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో పంట రుణాల మాఫీపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నాటికి రుణమాఫీకి అవసరమైన రూ.30 వేల కోట్లు సమీకరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కోడ్‌ కారణంగా ఇప్పటికే రూ.10 వేల కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉన్నట్లు సమాచారం. భూముల విలువల పెంపు, భూముల అమ్మకం, ఇతర ఆదాయ మార్గాలతో మిగతా రూ.20 కోట్లు సేకరించే ఆలోచనలో రేవంత్‌ సర్కార్‌ ఉంది. ఈమేరకు అన్ని శాఖలతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అంత ఈజీ కాదు..
పంట రుణాలు మాఫీ చేయడంతోపాటు ఆరు గ్యారంటీల్లోని మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, పెన్షన్ల పెంపు, విద్యార్థినులకు స్కూటీలు ఆర్థిక భారంతో కూడుకున్నవే. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా దృష్ట్యా హామీలు అమలు చేయడం అంత ఈజీ కాదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌ ఇప్పటికి నాలుగే అమలు చేస్తున్నారు. మిగతా వాటిని అమలు చేయడంతోపాటు రుణమాఫీ చేయడానికి నిధులు లేవు. ఇప్పటికే రైతుబంధు చెల్లింపులో కాంగ్రెస్‌ సర్కార్‌ విఫలమైందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

కేంద్రంలో అధికారంపై రేవంత్‌ ఆశలు..
కేంద్రంలో కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందనా ఆశతో తెలంగాణ సీఎం రేవంత్‌ ఉన్నారు. ఆ ధీమాతోనే ఆగస్టు 15లోగా రైతులు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారని తెలుస్తోంది. కేంద్ర మేనిఫెస్టోలో కూడా రుణమాఫీ హామీ ఉన్న నేపథ్యంలో కేంద్రం దానిని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తప్పుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే మిగతా గ్యారంటీలు అమలుకు ఇబ్బంది ఉండదని లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారంలోకి రాకుంటే..
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాని పక్షంలో పంట రుణాల మాఫీతోనే ఈ ఏడాది సరిపుచ్చే అవకాశం ఉంది. పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థికసాయం, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం, ధాన్యానికి రూ.500 బోనస్, రైతు భరోసా రూ.12 వేలకు పెంపు అమలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
Oktelugu Epaper