HomeతెలంగాణHyderabad polling : హైదరాబాద్ పోలింగ్..! దేశానికే అనేక సవాళ్లు..!

Hyderabad polling : హైదరాబాద్ పోలింగ్..! దేశానికే అనేక సవాళ్లు..!

Hyderabad polling : దేశంలో అత్యంత సమస్యాత్మకమైన లోక్సభ సెగ్మెంట్లలో హైదరాబాద్ ఒకటని చెప్పొచ్చు. ఇక్కడ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ లిమిట్స్ లో ఎంఐఎం చాలా బలంగా ఉంది. గోషామహల్,కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్లలో తప్ప మిగతా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో పతంగికి గట్టి పట్టుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ ఓవైసీ ఫ్యామిలీదే గెలుపు. గత 40 ఏళ్లుగా ఓవైసీ ఫ్యామిలీ అప్రతిహతంగా విజయాల పరంపరను కొనసాగిస్తూ..వస్తుంది.

అయితే గతం సంగతి ఎలా ఉన్నా.. ఈసారి మాత్రం హైదరాబాద్ లోక్సభ పోలింగ్..దేశానికి అనేక సవాళ్లను విసిరింది. ఈ సెగ్మెంట్ పరిధిలో ఈసారి ఎంఐఎం బీజేపీ మధ్య నడిచిన హోరా హోరీ పోరు.. ఎన్నికల వ్యవస్థకే అనేక పాటలను నేర్పింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో లక్షలాది బోగస్ ఓట్లు ఉన్నాయని చాన్నాళ్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఓట్లతోనే పతంగి పార్టీ విజయం సాధిస్తూ.. వస్తుందనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూడా ఓల్డ్ సిటీలో బోగస్ ఓట్లతోనే అసద్ గెలుస్తున్నారని చాలాసార్లు ఆరోపించారు. తాము ఈ విషయంలో ఎన్నోసార్లు రాష్ట్ర,కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు.

ఇక ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినప్పటికీ..హైదరాబాద్ పోలింగ్ విధానంలో మాత్రం పెద్దగా మార్పులు ఏమీ రాలేదు. అయితే ఈసారి బిజెపి తరఫున మాధవీలత బరిలో నిలవడం సంచలనం రేపింది. ఈసారి పోలింగ్ సందర్భంగా ఆమె హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అనేక బూతులు తిరుగుతూ..ఓటర్ల గుర్తింపును చెక్ చేసింది. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల కొందరు ఎంఐఎం పార్టీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రకటించడం సంచలనంగా మారింది. అంతేకాక ఆమె ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన సందర్భంగా ఓ ముస్లిం మహిళ హిజాబ్ తీసి ఓటర్ ఐడెంటిఫికేషన్ చెక్ చేయడంపై పలువురు విమర్శలు గుప్పించారు.

ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. హిజాబ్ తొలగించకుండా ఓటేసేందుకు వచ్చిన ఓటర్లను గుర్తించడం ఎలా అని కొందరు ప్రశ్నిస్తే.. హిజాబ్ ను తీసి ఓటర్ ను పరిశీలించడమనేది ఇస్లాం సంప్రదాయాలకు వ్యతిరేకమని మరికొందరు ఆరోపించారు. దీంతో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న చోట మహిళా ఓటర్లు పోలింగ్ స్టేషన్కు వచ్చినప్పుడు వారి ఐడెంటిఫికేషన్ గుర్తించే అంశంపై పెద్ద చర్చే మొదలైంది. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపైనే ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. అయితే ఎన్నికల కమిషన్ ఈ అంశంపై ఎలాంటి స్పష్టమైన వివరణను ఇస్తుందో తెలియదు కానీ..హైదరాబాద్ పార్లమెంట్ కు ఈసారి జరిగిన పోలింగ్ తీరు మాత్రం హిజాబ్ విషయంలో అందరినీ ఆలోచింపజేసినట్లైంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular