Akhanda 2: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్. ఈ నేపథ్యంలో బాలయ్యను హిట్ ట్రాక్ ఎక్కించిన అఖండ కు పార్ట్ 2 ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు బోయపాటి. ఈ సినిమా కథలో కీలక అంశాలు ఆయన రివీల్ చేశారు.
ఇప్పటివరకు బాలకృష్ణ – బోయపాటి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా సింహ కాగా, ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 2014లో వచ్చిన లెజెండ్, 2021 లో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. అఖండ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా ఆయన దైవ దూతగా, సంరక్షకుడిగా చేసిన అఘోర పాత్ర ఆడియన్స్ కి గూస్ బమ్స్ తెప్పించింది. ప్రేక్షకులకు నచ్చిన, మెచ్చిన పాత్రలో బాలయ్య మరోసారి ఫ్యాన్స్ ని ఖుషి చేయనున్నారట.
బోయపాటి – బాలయ్య కాంబోలో రాబోతున్న అఖండ 2 గురించి తాజాగా డైరెక్టర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి, బాలయ్య ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కారణంగా అప్డేట్ ఇవ్వలేదని .. ఎన్నికలు పూర్తి కాగానే అఖండ 2 అధికారిక ప్రకటన చేస్తామంటూ బోయపాటి క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా కథ దేని ఆధారంగా ఉంటుందో కూడా వివరించారు.
అఖండ లో పసిబిడ్డ, పరమాత్మ, ప్రకృతి కాన్సెప్టులు చూపించామని అన్నారు. దీని సీక్వెల్ అయిన అఖండ 2లో కూడా సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుందని స్పష్టం చేశారు. దైవత్వం అనేది ప్రతి ఒక మనిషిలో భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టినట్లు తెలిపారు. దీంతో అఖండ 2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తారని టాలీవుడ్ టాక్.
Web Title: Director boyapati srinu gives update on akhanda 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com