Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడుగా కూడా ఎదిగాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో రేసులో కొనసాగుతున్నాడు. ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే కెరియర్ మొదట్లో ఈయన చేసిన చాలా సినిమాల్లో ఆకతాయిగా తిరిగే కుర్రాడి గా కనిపిస్తూ వచ్చాడు. కానీ ఇక మీదట నుంచి అలాంటి క్యారెక్టర్ లను చేయడానికి తను ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తన క్యారెక్టర్ సినిమాకి హెల్ప్ అవుతూనే ఆ పాత్రను చూసిన యూత్ అందరూ తనని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడట. హీరో ఆకతాయిగా తిరుగుతూ ఉంటే తన అభిమానులు కూడా అలాగే ఆకతాయి గా తిరుగుతూ తనలా ఫీల్ అయిపోతున్నారని కొంతమంది తనతో చెప్పడం వల్ల ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడట..ఇక మీదట తను చేసే సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ కి ఏదైనా పర్పస్ ఉంటేనే ఓకే చేస్తానని చెప్తున్నాడు. అయితే తను చేసే ప్రతి పాత్ర ను కూడా తను హార్ట్ ఫుల్ గా ఫీల్ అయి చేస్తున్నట్టుగా తెలియజేశాడు.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఈ సినిమా మీద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఇక మరోసారి ఇలాంటి కామెంట్స్ రాకుండా ఉండడానికే మహేష్ బాబు ప్రతి సినిమాకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయడానికి తను సిద్ధంగా లేనని చెబుతూనే తను చేసే ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఇక మీదట ఆయన దగ్గరికి స్క్రిప్ట్ పట్టుకొని వెళ్లే దర్శకులు అందరూ అలాంటి మంచి క్యారెక్టర్లను డిజైన్ చేసుకోవాలని వాళ్ళకి హింట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది…