Industry Hit Movies: సినిమా ఇండస్ట్రీలో కొన్ని రోజులకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. నిజానికి వివిధ సంవత్సరాలలో ఒకే రోజున కొన్ని సినిమాలు వచ్చి మంచి విజయాలను సాధిస్తూ ఆయా హీరోలకు మంచి గుర్తింపును కూడా తీసుకొస్తూ ఉంటాయి. ఆ లెక్కకొస్తే మే 9 అంటే ఈరోజు చాలా సినిమాలు వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు ఇదే తేదీన వచ్చి సూపర్ సక్సెస్ లను అందుకున్నారు. మరి ఆ హీరోలు ఎవరు వాళ్ళ సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…
జగదేక వీరుడు అతిలోక సుందరి…
చిరంజీవి హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1990 మే 9వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు విపరీతమైన వర్షం తుఫాను ఉండడంతో ఈ సినిమా రెండు మూడు రోజుల వరకు ఎవ్వరు చూడడానికి కూడా రాలేదు. ఇక దాంతో ఈ సినిమా ప్లాప్ అవుతుందా అని అందరూ అనుకున్నారు. కానీ మౌత్ టాక్ తో ఈ సినిమా రోజురోజుకీ కలెక్షన్ల ను పెంచుతూ సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది…
గ్యాంగ్ లీడర్
ఇక జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న చిరంజీవి మళ్లీ అదే తేదీన మరొక సినిమాతో రావాలని నిర్ణయించుకున్నాడు. అందుకే జగదేకవీరుడు సినిమా వచ్చిన సంవత్సరానికి అంటే 1991 మే 9వ తేదీన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ముగ్గురు అన్నదమ్ముల అనుబంధంతో సాగే సినిమా కావడం, అలాగే రివెంజ్ బ్యాక్ డ్రాప్ తో కొనసాగే సినిమా కావడం వల్ల ఇది సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా చిరంజీవి వరుసగా రెండు సంవత్సరాల్లో అదే రోజున రెండు సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని చరిత్రలో నిలిచిపోయాడు. ఇక సినిమా అప్పట్లో దాదాపు 10 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టడం విశేషం…
ప్రేమించుకుందాం రా
వెంకటేష్ హీరోగా జయంత్ సి పరంజి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1997 మే 9వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథని చూపిస్తూ సాగుతుంది. అందువల్లే ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా సూపర్ డూపర్ సక్సెస్ సాధించి 20 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది…
సంతోషం
నాగార్జున హీరోగా దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లవ్ అండ్ ఫ్యామిలీ జనర్లో తెరకెక్కి సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమాతో నాగార్జున నంది అవార్డు ని కూడా అందుకున్నాడు. ఇక ఫిల్మ్ ఫైర్ అవార్డుల విషయానికొస్తే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆర్పీ పట్నాయక్ కి కూడా అవార్డు అయితే వచ్చింది…
మహానటి
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇదే రోజున రిలీజ్ అయి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. కేవలం 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 85 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది…
మహర్షి
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక గొప్ప కథాంశంతో రావడం మహేష్ బాబు కెరియర్ లోనే చాలా స్టైలిష్ గా కనిపించిన సినిమాలో కూడా ఈ సినిమా చరిత్రలో నిలిచింది. ఇక ఈ సినిమాకు ఉత్తమ చిత్రం గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అలాగే ఉత్తమ కొరియోగ్రఫర్ రాజు సుందరం కు కూడా నేషనల్ అవార్డు వచ్చింది…
ఇక అన్ని కుదిరితే ఈ సంవత్సరం ఇవాళ్ళ కల్కి సినిమా రిలీజ్ అయ్యేది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది…