DJ Tillu Cube : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు సిద్దు జొన్నలు గడ్డ…ఇంతకుముందు డిజే టిల్లు సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న తను ఇప్పుడు దానికి సీక్వెల్ ని తీసి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా సంపాదించాడు.
కొన్ని చోట్ల స్టార్ హీరోల రికార్డులను కూడా బ్రేక్ చేసేంత కలెక్షన్స్ రాబట్టిన ఈ హీరో ఇప్పుడు టిల్లు క్యూబ్ సినిమాను కూడా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే “డీజే టిల్లు” అనే వాడు చాలా డిఫరెంట్ గా నటిస్తూ ఉంటాడు. అలాగే వాడు ఎవరి చేతిలో ఎలా మోసపోతున్నాడు అనేది కూడా మనకు రెండు సినిమాల్లో చాలా బాగా చూపించారు. ఇక మూడో సినిమాలో కూడా తను మళ్లీ మరొక హీరోయిన్ చేతిలో మోసపోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కథ చర్చలు వేగంగా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ డ్యూటీ అయిన త్రృప్తి డిమ్రీని తీసుకునే ప్రయత్నంలో సినిమా యూనిట్ ఉన్నట్టు గా తెలుస్తుంది. అయితే ఈవిడ రీసెంట్ గా రణ్బీర్ కపూర్ హీరోగా వచ్చిన అనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈమె అందానికి, అభినయానికి ఫిదా అయిపోయిన జనాలు ఆమెకు ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇక అందుకే ఆమె ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే సిద్దు జొన్నలగడ్డ చేసే ఈ సినిమాలో కూడా తనను హీరోయిన్ గా తీసుకోవాలని సినిమా మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే సిద్దు వరుసగా టిల్లు సిరీస్ తో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంటాడనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు తెలుగులో ఒక సినిమాకి మూడు సీక్వెల్స్ వచ్చి సక్సెస్ అయిన దాఖాలాలు లేవు. కాబట్టి ఈ సినిమాతో కనక సక్సెస్ ని సాధిస్తే ఆ ఫీట్ ను సాదించిన మొట్టమొదటి హీరోగా కూడా సిద్దు జొన్నలగడ్డ మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు