Kalki Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాధించడమే కాకుండా తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు అన్నీ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.
ఒకవేళ ఈయన సినిమాలు ఫ్లాప్ అయిన కూడా భారీ వసూళ్ళనైతే రాబడుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ప్రభాస్ కి బాలీవుడ్ ప్రేక్షకులు అండగా నిలుస్తున్నారనే చెప్పాలి. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు సైతం లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రభాస్ కి ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాకి హైప్ పెంచడానికి సినిమా దర్శకుడు అయిన నాగ్ అశ్విన్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక వాయిస్ ఓవర్ ను చెప్పిస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ వాయిస్ ఓవర్ తో సినిమాకి మరింత హైప్ ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే ప్రభాస్ సినిమాలో మహేష్ బాబు వాయిస్ వినిపించడం అనేది నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి. ఇక ప్రభాస్ అభిమానులకు, మహేష్ బాబు అభిమానులందరికీ కూడా ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. నిజానికి వీళ్ళిద్దరూ కూడా స్టార్ హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ ఇద్దరు కూడా చాలా సైలెంట్ గా ఉండే హీరోలు..
ఎవరితో వివాదాలు లేకుండా వాళ్ళ పని ఏంటో వాళ్ళు చూసుకుంటూ వెళ్లిపోయే క్యారెక్టర్ ఉన్న హీరోలు కావడం వల్లే, వీళ్లంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికీ అమితమైన గౌరవం అయితే ఉంటుంది. ఇక మహేష్ బాబు పాన్ వరల్డ్ లో సూపర్ సక్సెస్ కొట్టడానికి రాజమౌళితో చేతులు కలిపాడు. కాబట్టి ఆ సినిమాకు సంబంధించిన పనుల్లో తను చాలా బిజీగా ఉన్నాడనే చెప్పాలి…