Kalki 2898 AD : ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ తెలుగులో చిన్న హీరోగా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా ఎదిగేంత వరకు తన ప్రయాణం సాగింది. అంటే దానికి ఆయన సినిమా మీద పెట్టిన డేడికేషన్ కారణమనే చెప్పాలి. ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా ఆయన పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్నాడు.
ఇక అప్పటి నుంచి వరుస సినిమాలతో పాన్ ఇండియా ఇండస్ట్రీని కొల్లగొడుతూ వస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమాతో కూడా 900 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కల్కి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి బయలుదేరుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా మీద ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుపుకుంటుంది.
ఇక అందులో భాగంగా ఈ సినిమాని 6 వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించ్చినప్పటికి ఈ సినిమా రిలీజ్ కి ముందే 700 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇది చూసిన బాలీవుడ్ హీరోలు సైతం ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఒక్క సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ 700 కోట్లు కావడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ప్రభాస్ కల్కి సినిమా అంతటి బిజినెస్ ను కొల్లగొట్టిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో నాగ్ అశ్విన్ ఒక వండర్ ని క్రియేట్ చేయబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఇంకా కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక దానికి పునాదిగా ఈ సినిమాని చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితేనే ఆయన తన నెక్స్ట్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని బ్లాక్ బస్టర్ హిట్టుగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు…