Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన రెండ్రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరి కలెక్షన్ల కింగ్‌గా నిలిచారు పుష్పరాజ్. ఈ సినిమా కంటే ముందే, ఇందులోని పాటలు కూడా రికార్డులను నెలకొల్పాయి. శ్రీవల్లి, రారా సామి అంటూ సాగే సాంగ్స్ ఎంత హిట్ అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సాంగ్స్ వైరల్‌గా మారాయి.
అయితే, ఇంతకు రెట్టింపు హిట్‌గా నిలిచిన సాంగ్ ఊ అంటావా మావ.. సమంత స్పెషల్ ఎంట్రీ ఇస్తూ వచ్చిన ఈ పాట నెట్టింట్లో సృష్టించిన హల్చల్ అంతా ఇంతా కాదు. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ వ్యూస్ దక్కించుకున్న ఏకైక పాటగా ఈ సాంగ్ రికార్డులు నెలకొల్పింది.
ఇందులో సమంత క్యూట్, హాట్ ఎక్స్ప్రెషన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ఓ వైపు ఫేమస్ అవుతూనే.. మరోవైపు వివాదాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులో మగవాళ్లను కించపరుస్తూ లిరిక్స్ ఉన్నాయని పలువురు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. కాగా, తాజాగా, ఈ పాటలో సమంత వేసిన ఓ స్టెప్‌పై నెట్టింట్లో మీమ్ చేస్తున్నారు. ఇందులో సమంత వేసిన ఓ స్టెప్ ఒకప్పుడు బ్రహ్మానందం ఇచ్చిన ఫోజ్‌కు సరిగ్గా సెట్ అయ్యిందంటూ.. మా బహ్మి స్టైల్‌ను కాపీ చేయకు సామ్.. అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ఈ మీమ్ నెట్టింట వైరల్‌గా మారింది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Comedian brahmanandam interesting comments on samantha oo antava song in pushpa
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com