Taraka Ratna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా నందమూరి తారక రామారావు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈయన వారసుడిగా ఆయన కొడుకులు బాలకృష్ణ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న మిగిలిన కొడుకులు సినిమా రంగంలోనే నిర్మాతలుగా, డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక నందమూరి వంశం నుంచి మూడవ తరంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రస్తుతం నందమూరి వారసుడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా ఎన్నో సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక నందమూరి వంశం నుంచి తారకరత్న ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈయన మొట్టమొదటిసారిగా ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆ తర్వాత హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చారు.
Also Read: SS Rajamouli: తన పేరుకు ముందున్న ఎస్ఎస్ అంటే అర్థం ఏంటో చెప్పిన రాజమౌళి
తారకరత్న నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. ఇక రవిబాబు దర్శకత్వంలో అమరావతి అనే చిత్రంలో విలన్ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించి మంచి గుర్తింపు పొందారు.అయితే ప్రస్తుతం తారకరత్న నందమూరి కుటుంబంతో కాకుండా విడిగా ఉంటున్నారు.అందుకు గల కారణం ఏమిటి ఆయన ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చారు అనే విషయానికి వస్తే… ఈయన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టారు. తనకు ఒక అమ్మాయి ఎంతగానో నచ్చిందని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే అప్పటికే ఆ అమ్మాయికి వివాహం కావడంతో తారకరత్నకు ఇంటి నుంచి ఏ మాత్రం మద్దతు లభించలేదు. అందుకోసమే ఈయన ఇంటి నుంచి బయటకు వచ్చి తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని నందమూరి కుటుంబం నుంచి విడిగా ఉంటున్నారు.
Also Read: Godse Movie: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ కానున్న… గాడ్సే మూవీ టీజర్