KCR : ప్రతి సంవత్సరం నిర్వహించే జన్మదిన వేడుకల్లో కేసీఆర్ పేరును ఆ పార్టీ నాయకులు అదే విధంగా సంబోధిస్తారు. పది సంవత్సరాలపాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి బంగారు తెలంగాణ సృష్టికర్త.. తెలంగాణ ఉద్యమకర్త.. ఇంకా చాలా పేర్లను ఉటంకించేవారు. అంతేగాని ఎప్పుడు కూడా వారు కేసీఆర్ ను “బాపూ” అని సంబోధించలేదు. కొంతమంది నాయకులు అప్పుడప్పుడూ అలా పిలిచినప్పటికీ ఆ పేరు ఎక్కువగా వ్యాప్తిలో లేదు. అయితే శనివారం కేసీఆర్ 70 వ పడిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. భారత రాష్ట్ర సమితి నుంచి రాజ్యసభ సభ్యుడిగా మరోసారి నామినేట్ అయిన వద్దిరాజు రవిచంద్ర ఈరోజు ప్రధాన పత్రికలన్నింటికీ ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. అందులో కెసిఆర్ ను “బాపూ” సంబోధించారు. వద్దిరాజు రవిచంద్ర కు రాజ్యసభ స్థానం ఇచ్చారు కాబట్టి అలా అన్నారనుకోవచ్చు. శనివారం జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భారత రాష్ట్ర సమితి నాయకులు “బాపూ” అని విస్తృతంగా సంబోధించడం విశేషం.
కెసిఆర్ పది సంవత్సరాల పాలనపై పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రస్తుత నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితి నాయకులు కేసీఆర్ ఇమేజ్ పెంచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ జాతిపితగా నిలిపేందుకు భారత రాష్ట్ర సమితి నాయకులు సొంత మీడియా, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రయత్నాలు చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతగా ఆయనకు ప్రజల్లో సుస్థిర స్థానం ఉందని.. తెలంగాణ జాతిపితగా ఆయనపై ప్రత్యేక గౌరవం కల్పించేందుకు ఆ పార్టీ నేతలు ఇలాంటి చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. కెసిఆర్ 70 వ పడిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయనను “బాపూ” గా సంబోధించారని తెలుస్తోంది. కెసిఆర్ ను ప్రజల సైతం “బాపూ” అని పిలిచే విధంగా అన్ని మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం కల్పించారు. భారత రాష్ట్ర సమితి అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లో.. పార్టీ కార్యకర్తల ఖాతాల్లోనూ బాపూ అనే పేరు పదే పదే మారుమోగేలా చేశారు.
కెసిఆర్ 70వ జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా జరిపారు. 70 కిలోల కేక్ ను భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు దీన్ని కట్ చేశారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, లకు బీమా పత్రాలు అందజేశారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరిగాయి..కాగా, గురువారం తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన కేసీఆర్ శనివారం కూడా అక్కడే ఉన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఎటువంటి ఫోటోలు బయటకు రాలేదు.