బ్రిటన్ ప్రధానికి బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటీవ్
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటీవ్ వచ్చింది. కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోగా ఆయనకు పాజిటీవ్ అని తేలిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాధినేతనే కరోనా బారిన పడటం ప్రజలను దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. ‘‘నాకు కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయి’’ అని బోరిస్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టి వ్యక్తిగత సలహా మేరకు ప్రధానమంత్రిని కరోనావైరస్ కోసం […]

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటీవ్ వచ్చింది. కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోగా ఆయనకు పాజిటీవ్ అని తేలిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాధినేతనే కరోనా బారిన పడటం ప్రజలను దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది.
‘‘నాకు కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయి’’ అని బోరిస్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టి వ్యక్తిగత సలహా మేరకు ప్రధానమంత్రిని కరోనావైరస్ కోసం పరీక్షించారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి తెలిపారు. ఈ పరీక్ష ఎన్‌హెచ్ఎస్ సిబ్బంది నిర్వహించారని ఆయన తెలిపారు.
గత 24 గంటల్లో శరీరంలో కొద్దిగా టెంపరేచర్ పెరిగిందని, పదేపదే దగ్గు రావడం వల్ల.. డాక్టర్లను సంప్రదించినట్లు ఆయన చెప్పారు. కాగా, బ్రిటన్ యువరాజు చార్లెస్ కు రెండు రోజులక్రితమే వైరస్ పాజిటివ్ వెల్లడి కావడం తెలిసిందే.
మొన్నటి వరకు కరోనా మహమ్మారికి నీవంటే నీవే కారణం అంటూ పరస్పరం నిందించుకున్న చైనా, అమెరికా ప్రభుత్వాలు ఇప్పుడు సమాలోచనలు ప్రారంభించాయి. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు శుక్రవారం ఫోన్‌చేసి కరోనా అంశంతోపాటు రెండు దేశాల మధ్య ఇటీవలే కుదిరిన నూతన వాణిజ్య విధానంపై కూడా చర్చించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.
కోవిడ్ 19 వైరస్ సమాచారాన్ని చైనా సరైన సమయంలో ప్రపంచంతో పంచుకోలేదని, ఆ వైరస్ చైనా సృష్టేనని ఇటీవల ట్రంప్ ఇంతకు ముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. చైనా కూడా ఎదురుదాడి చేస్తూ అమెరికా సైన్యమే తమదేశంలో ఈ వైరస్‌ను వదిలిందని ఆరోపించింది.
శుక్రవారం నాటికి ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగా అమెరికా నిలువటంతో రెండు దేశాలు విమర్శలు మాని చర్చల బాట పట్టాయి.
కరోనాను చైనా విజయవంతంగా నియంత్రించటంతో ఈ మహమ్మారిని ఎదుర్కోవటంలో ప్రపంచానికి ఇప్పడు ఆ దేశమే మార్గదర్శమైంది. కరోనాను ఎదుర్కోవటంలో అమెరికాకు సహకారం అందివ్వగలమని జిన్‌పింగ్ హామీ ఇచ్చారని చైనా విదేశాంగశాఖ తెలిపింది.