Sathyaraj: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ అని తేలుతుంది. ఇప్పటికే సీనియర్ నటుడు సత్యరాజ్ కరోనా బారిన పడ్డారు. అయితే, ఆయన పరిస్థితి విషమించింది. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు .
ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిజానికి అప్పటి నుంచి ఆయన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే, గత రాత్రి సత్యరాజ్ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది. ‘బహుబలి’లో కట్టప్పగా సత్యరాజ్ అందరికి బాగా దగ్గర అయ్యాడు. దాంతో ‘బాహుబలి’ నటుడికి కరోనా అంటూ నేషనల్ రేంజ్ లో ఈ వార్త వైరల్ అవుతుంది.
ఏది ఏమైనా కరోనా భయం మళ్ళీ మొదలైంది. మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు. షూటింగ్ స్పాట్స్ లో కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. అన్నట్టు స్టార్ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తనకు కోవిడ్ సోకిందని ఆమె తాజాగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం త్రిష వైరస్ నుంచి వేగంగా కోలుకుంటుంది.
ఇప్పటికే సత్యరాజ్ అండ్ త్రిష వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినా కరోనా వచ్చింది.
ఏది ఏమైనా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక సినిమా మేకర్స్ మళ్ళీ ఆందోళన బాట పట్టారు. షూటింగ్ కి బ్రేక్ ఇద్దామంటే.. ఇప్పటికే మొదలైన సినిమాలకు అతి గతి లేకుండా పోతుంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Legendary actor sathyaraj hospitalized suddenly
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com