Corona Risk: ప్రజలను తీవ్రస్థాయిలో భయాందోళనకు గురి చేస్తున్న వైరస్ లలో కరోనా వైరస్ ఒకటనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వాళ్లు సులువుగానే కోలుకుంటున్నా వాళ్లను దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. తాజాగా స్వీడన్ పరిశోధకులు కరోనా వైరస్ గురించి పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు రక్తం గడ్డకట్టే ముప్పు ఆరునెలల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో సాధారణ రక్తస్రావం అయ్యే అవకాశం రెండు నెలల పాటు ఉండగా కాలు రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టే ముప్పు మూడు నెలల పాటు ఉండే అవకాశం అయితే ఉంది. కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నవారిలో కూడా ఈ సమస్య కనిపించే అవకాశాలు అయితే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. ఫస్ట్ వేవ్ లో వైరస్ బారిన పడిన వాళ్లలో ఈ ముప్పు మరింత ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు.
10 లక్షల కరోనా సోకిన కేసులను కరోనా సోకని 40 లక్షల కేసులతో పోల్చి చూసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 6 నెలల వరకు ఊపిరితిత్తులలో రక్తం గడ్డ కట్టే అవకాశం అయితే ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా కనిపించిన వాళ్లకు ఈ ముప్పు మరింత ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రక్తం గడ్డ కట్టడానికి కచ్చితమైన కారణాలను గుర్తించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
కరోనా వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి కరోనా వ్యాక్సిన్ ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు అన్నారు. పరిమితులకు లోబడి ఈ అధ్యయనం చేశామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Increased risk of serious blood clots up to six months after covid 19 study
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com