అందరి హీరోలు ఒక ఎత్తు.. మహేశ్ బాబు ఒక ఎత్తు.. ఎవర్ గ్రీన్ గ్లామర్ మహేశ్ సొంతం.. అందరూ ఏజ్ లా కనిపించినా.. మహేశ్ ఇప్పటికీ చాక్లెట్ బాయ్ లా మెరిసిపోతూనే ఉంటాడు.. మరి ఇంత గ్లామర్ గా ఉండడానికి మహేశ్ ఏం చేస్తాడు. ఏం తింటాడు.. అనేది ఎవ్వరికీ తెలీదు.. కానీ ఆ రహస్యం బయటపడింది. ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు మహేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు.
ALso Read: ‘రింగు’లోకి వస్తున్న విజయ్ దేవరకొండ..!
తన గ్లామర్ కోసం మహేశ్ బాబు విదేశాలకు టూర్ లు వెళుతుండాట.. తన శరీరం నిత్యయవ్వనంగా ఉండడానికి శరీరానికి డీ టాక్సినేషన్ రెగ్యులర్ గా చేయించుకుంటాడట.. ఈ మేరకు ఓ చిత్రం యూనిట్ ఈ విషయాలను బయటపెట్టింది..
మహేశ్ బాబు ఏటా రెండు సార్లు ఫారిన్ టూర్ వేస్తుంటారు.. అది ఫ్యామిలీతో కలిసి.. అందరూ అది హాలీడే ట్రిప్ అనుకుంటారని మనకు తెలుసు.. కానీ దాంతోపాటు ఆరోగ్య సంరక్షణ దాగి ఉందని తెలిసింది..
మహేష్ బాబు తన శరీరానికి డీ టాక్సినేషన్ ఏడాదికి రెండు సార్లు మహేశ్ చేయించుకుంటారట.. ఈ చికిత్సలో మలినాలను శరీరం నుంచి తొలగిస్తారు. కొన్ని మెడిసిన్స్, కొంత ఎక్సర్ సైజ్, కొంత మసాజ్ చేస్తారు.. ఈ చికిత్సలో చెమటల ద్వారా బాడీలోని మలినాలను బయటకు పోయేలా చేస్తారు.. ఇంతకుముందు కూడా మహేశ్ ఇలానే ఫారిన్ టూర్లు, దేశంలోని డెహ్రాడూన్ కు వెళ్లి డీ టాక్సినేషన్ చేయించుకున్నాడట.. సో మహేశ్ గ్లామర్ వెనక ఈ టాక్సినేషన్ అని ఇప్పుడు టాలీవుడ్ కోడై కూస్తోంది.
ALso Read: లాస్య రచ్చ పై గీతా మాధురి కౌంటర్ !