Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చిరంజీవి(Chiranjeevi) ఎన్నో విమర్శలను ఎదుర్కొని, ఎంతో ఓపికను మూటగట్టుకొని, నిదానంగా అడుగులు వేస్తూ తను చేరే గమ్యం చాలా పెద్దది కావడం వల్ల , రాత్రికి రాత్రి దాన్ని చేరుకోవడం కష్టం కావడం వల్ల అందువల్లే సహనం చాలా ముఖ్యం అని ముందు నుంచే ప్రిపేర్ అయి వచ్చిన చిరంజీవి వచ్చిన అవకాశాన్ని వాడుకొని స్టార్ హీరోగా ఎదిగాడు…
ఇక ఆ తర్వాత మెగాస్టార్ గా ఇండస్ట్రీని శాసించాడనే చెప్పాలి. ఇంకా ఇప్పటికీ కూడా ఆయన ఇండస్ట్రీలో మెగాస్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అంటే ఆయన డెడికేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కూడా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చిన్న వయసులో ఉన్నప్పుడే చిరంజీవి సినిమాల్లో వేసే డ్యాన్సులు గాని, చిరంజీవి చెప్పే డైలాగులను గాని చెబుతూ ఇంట్లో సభ్యులను అలరించేవాడట. ఇక అప్పుడే చిరంజీవి కి రామ్ చరణ్ టాలెంట్ ఏంటో అర్థం అయిపోయిందట.
దానివల్లే రామ్ చరణ్ ఫ్యూచర్ లో చాలా పెద్ద హీరో అవుతాడని ఇంట్లో ఉన్న అతని భార్యతో గాని, అతని తమ్ముళ్లతో గాని చెబుతూ ఉండేవాడట. ఇక చిరంజీవి చెప్పినట్టుగానే ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు…అందుకే మొదటి నుంచి చిరంజీవి రామ్ చరణ్ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేలా చూసుకుంటూ పెంచాడట.. ఎప్పటికైనా ఇండస్ట్రీలో తను స్టార్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం తోనే రామ్ చరణ్ ని ప్రతి సినిమా చూడమని చెప్పేవాడట.
యాక్టింగ్ కి సంబంధించిన మెలుకువలను కూడా చిరంజీవి ఇంట్లో ఉన్న సమయంలో చెబుతూ చిన్నప్పటి నుంచి తనని ట్రైన్ చేసుకుంటూ వచ్చాడు. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ స్టార్ హీరో అవ్వడం లో చిరంజీవి పాత్ర చాలా కీలకమనే చెప్పాలి…