Bernard Hill: ఇప్పటి వరకు ఏ సినిమా ఇండస్ట్రీలో లేని నటులు హాలీవుడ్ ఇండస్ట్రిలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్లు ఒక సినిమా కోసం గానీ, ఒక క్యారెక్టర్ కోసం గాని ప్రాణం పెట్టి నటిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా అక్కడున్న టెక్నాలజీని వాడుకుంటూ అద్భుతమైన సినిమాలను చేస్తూ ఉంటారు.
ఒక క్యారెక్టర్ ని మలచడంలో దర్శకులు చాలా డిఫరెంట్ పద్ధతులను అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక అందులో భాగంగానే జేమ్స్ కామెరూన్ డైరెక్షన్ చేసిన ‘టైటానిక్ ‘ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఇక అందులో చాలా మంది నటీనటులు నటించి మెప్పించారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక టైటానిక్ సినిమాలో నటించిన “బెర్నల్డ్ హిల్” అనే నటుడు ఆదివారం రోజు మరణించారు.
ఇక ఈయన చాలా సినిమాల్లో నటించినప్పటికీ మన తెలుగులో ఆయన్ను టైటానిక్, “లార్డ్ ఆఫ్ ది రింగ్స్” అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను సైతం అలరించాడు. ఇక ఈయనకి ఏ పాత్ర ఇచ్చిన అందులో ఒదిగిపోయి నటిస్తూ ఉంటాడు. ఇక ఎవరికి సాధ్యం కానీ రీతిలో ఒక వైవిధ్యమైన పాత్రను తనకు అనుకూలంగా మార్చుకొని నటించి మెప్పించడంలో ఈయన సిద్ధహస్తుడు. ఇక ఈయన మరణ వార్తను ప్రముఖ నటుడు అయిన ‘బార్బరా డిక్సన్’ తన ఎక్స్ ( ట్విట్టర్) లో ప్రస్తవిస్తూ ‘బెర్నార్డ్ హిల్’ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం.
ఆయన లేరు అనే విషయాన్ని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది అంటూ తను ట్విట్టర్ వేదికగా రాసుకోచ్చాడు… ఇక ఇది చూసిన చాలా మంది హాలీవుడ్ ఇండస్ట్రీ చాలా గొప్ప నటుడిని కోల్పోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆయన లాంటి నటుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈయనకి జేమ్స్ కామెరూన్ కి మధ్య మంచి అనుబంధమైతే ఉంది. అందువల్లే తను చేసిన సినిమాల్లో ఆయనకు తరచుగా అవకాశాలను ఇస్తూ ఉంటాడు…